బాక్సాఫీస్ వద్ద ట్రెండ్ సెట్ చేస్తున్న జై లవకుశ సరికొత్త రికార్డు వసూళ్ల సునామీతో స్పైడర్ కు షాకిస్తున్న జైలవకుశ పది రోజుల్లో 175 కోట్ల వసూళ్లు సాధించిన ఎన్టీఆర్ జైలవకుశ 

జైలవకుశ చిత్రం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటిదాకా ఏదో ఒక ప్రత్యేకతతో హెడ్ లైన్ వార్తల్లో నిలుస్తోంది. బాహుబలి2 చిత్రం తర్వాత స్థానంలో నిలిచే ఇండస్ట్రీ హిట్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం భవిష్యత్ లో నాన్ బాహుబలి టార్గెట్ అంటే అది జైలవకుశ కలెక్షన్సేనని, ఇదే బెంచ్ మార్క్ గా నిలిస్తుందని తెలుస్తోంది.

తొలి వారాంతంలో వంద కోట్ల క్లబ్ లో చేరన జై లవకుశ రెండో వారం కూడా భారీ స్థాయిలో వరల్డ్ వైడ్ కలెక్షన్స్ సాధించింది. బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ సరసన రాశిఖన్నా, నివేదా థామస్ హిరోయిన్లుగా నటించిన జైలవకుశ రెండో వారం కలెక్షన్స్ 175కోట్లకు చేరాయని ప్రముఖ ట్రేడ్ ఎనలిస్ట్ ఉమైర్ సంథూ ట్వీట్ చేశారు. ఆట్వీట్ ఈ క్రింద చూడొచ్చు.

Scroll to load tweet…