దివంగత నటి శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ నేటితో 21వ వసంతంలోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. తల్లిని కోల్పోయిన విషాదంలో ఉన్న జాహ్నవి కపూర్‌కు ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, వెల్ విషెర్స్ పుట్టినరోజు సందర్భంగా విష్ చేస్తూ ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం తల్లి తో అంగరంగ వైభవంగా సెల్ బ్రేషన్స్ చేసుకునే జాహ్నవి కానీ ఈ పుట్టిన రోజు శ్రీదేవిని తల్చుకుంటు అనదాశ్రమంలో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న జాహ్నవి.

ముంబాయిలోని ఒక ఓల్డేజ్ హోమ్ కి వెళ్లి అక్కడ వాళ్లతో తన పుట్టినరోజును కేక్ కట్ చేస్తు సెలబ్రేట్ చేసుకుంది. ఎక్కడ ఏ ఆర్బాటం లేకుండా సాధారణంగా జరపుకోవడం విశేషం. ఈ ఫోటో చూస్తుంటే జాహ్నవి ఎంతటి భాదలో ఉందో అర్థమవుతుంది. ఎంతైనా శ్రీదేవి లోటు కుటుంబ విషయంలో స్పష్టంగా తెలుస్తుంది.