శ్రీదేవి మంణంతో ఒక పక్క పట్టని దుఖంలో ఆమె కుటుంబం తల్లడిల్లిపోతుంటే. మరోపక్క ఆమె కుటుంబానికి సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.  శ్రీదేవి తుదిశ్వాస కొల్పోవడంతో ఆమె ఇద్దరి కూతుళ్ల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. ప్రస్తుతం పెద్ద కూతురు జాహ్నవి కపూర్ దడక్ సినిమాతో వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా భాధ్యతలన్నీ కరణ్ తన బుజాన వేసుకున్నాడు. అయితే తన కూతురి తొలి సినిమాని చూసి మురిసిపోవాలనుకున్న శ్రీదేవి కల కలగానే మిగిలిపోయింది. ఇక జాహ్నవిని కూడా తనంతటి స్థాయిలో చూడాలని ఎప్పుడు భావించే శ్రీదేవి తన ఆశ నెరవేరుతుందో లేదో తెలీదు. కానీ శ్రీదేవి బతికున్నప్పుడే పెద్ద కుమార్తె జాహ్నవి పెళ్లి విషయం గురించి కుటుంబంలో ఒ చర్చ జరిగినలట్లు వార్తలొచ్చాయి.

 

దగ్గరి బంధువులు, దేశంలో కుబేరుల్లో ఒకరైన అనీల్ అంబానీ కుమారుడితో జాహ్నవి పెళ్లి నిశ్చయించారట. ఒకవేళ సినిమా కెరీర్ లో జాహ్నవి సక్పెస్ కాకపోతే వెంటనే అనీల్ అంబానీ తనయుడితో వివాహం జరిపించి గ్రేట్ బిజినెస్ మెన్ కోడలిగా చూడాలని శ్రీదేవి తన సన్నిహితులతో చెప్పేదని బాలీవుడ్ ప్రముఖులు చెప్తున్నారు. అయితే శ్రీదేవి కి అంబానీ ఇచ్చిన మాట ప్రకారం శ్రీదేవి కూతరికి తన కొడుకునిచ్చి పెళ్లి చేయటంలో ఎలాంటి సందేహం లేదని బాలీవుడ్ ప్రముఖులు చెప్తున్నారు. అయితే తల్లి పోయిన దుఖంలో ఉన్న జాహ్నవి పెళ్లి పై ఆసక్తి చూపిస్తుందా లేదా అని అందరు ఆసక్తి చూపిస్తున్నారు.
మెత్తానికి బాలీవుడ్ మొత్తం ఇదే విషయం పై చర్చ సాగుతుంది.