Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు మార్చి 3వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఈరోజు ఎపిసోడ్ లో వసుధార మన అంటే మనిద్దరం సర్ దానికి కూడా కొత్త అర్థం చెప్తారేమో, ఇప్పటి దాకా రిషిధార లుగా మనంగా భావించాను. కానీ రిషికి ధారకు మధ్య కనిపించిన దూరం ఏదో మీకు కనిపించినట్టు ఉంది సార్. భార్యాభర్తల మధ్య బంధం లోనే ఏదో కొత్త అర్థాన్ని చూపించారు. నా భార్యవి నువ్వు కాదు అని టెక్నికల్ గా కూడా అంటున్నారు అంటూ బాధగా మాట్లాడుతుంది వసుధార. అప్పుడు రిషి నేను చెప్పిన దాంట్లో నీకు తప్పుగా అనిపించొచ్చు కానీ అందులో తప్పేముంది వసుధార అని అంటాడు రిషి. అవును సార్ తప్పంతా నాదే మీరు ఆ మాట అన్నపుడే ఎక్కువగా సంతోషపడ్డాను కానీ ఆ మాట వెనుక ఇంత అర్థం ఉందని గ్రహించలేకపోయాను అనే బాధగా మాట్లాడుతుంది వసుధార.
నేను చెప్పింది సరిగా అర్థం చేసుకోవేంటి అనగా బాగా అర్థమైంది సార్ స్పష్టంగా అర్థమయింది అని అక్కడి నుంచి వెళ్తుండగా తప్పంతా నువ్వు చేసి మళ్ళి కోపం చూపిస్తావేంటి పొగరు అనడంతో ఈ వసుధార తప్పు చేయదు సర్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వసుధార. మరొకవైపు జగతి మహేంద్ర జరిగిన విషయాన్ని తలచుకొని సంతోషపడుతూ వారిద్దరి మధ్య ఉన్న దూరం తగ్గిపోయింది చిక్కుముడి విడిపోయింది అని సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు ఏదైనా పార్టీ చేసుకుందాం అనుకుంది మాట్లాడుతూ ఉండగా అప్పుడు వస్తదారా ఏడుస్తూ వెళుతుండడంతో ఇద్దరు టెన్షన్ పడుతూ అక్కడికి వెళ్తారు. ఏమైంది వసుధార ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు అనడంతే వసుధార మౌనంగా ఉంటుంది. సమస్యలని పోయాయి కదా ఇంకా ఈ ఏడుపు ఎందుకు అని అంటాడు మహేంద్ర.
నన్ను ఎవరు ఏమీ అనలేదు సార్ నన్ను కాసేపు ప్రశాంతంగా వదిలేయండి నేను వెళుతున్నాను మేడం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో జగతి,మహేంద్ర అసలు ఏం జరిగింది అనుకొని టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు జరిగింది చిన్న విషయం కాదు రిషి కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు. నువ్వు వెళ్లి రిషి దగ్గర ఉండు రిషికి ధైర్యం చెప్పు వెళ్ళు అని చెబుతుంది జగతి. అప్పుడు వసుధార నేను వస్తున్నాను ఆగు అంటూ జగతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు రిషి తన క్యాబిన్ లో హార్ట్ సింబల్ చూస్తూ జరిగిన విషయాలు తలుచుకొని ఆ హార్ట్ సింబల్ తో తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు.
అప్పుడు మహేంద్ర అక్కడికి వచ్చి కంగ్రాట్స్ రిషి అనగా ఎందుకు డాడ్ అనడంతో అలా అందరి ముందు నువ్వు ఒప్పుకున్నావు కదా నాకు మనసుకి ఎంతో ఆనందంగా అనిపించింది రిషి అని పొగుడుతూ ఉంటాడు మహేంద్ర. అందరి ముందు తాను ఇబ్బంది పడకూడదని ఒప్పుకున్నాను డాడ్ అనగా వసుని నువ్వు కాకపోతే ఇంకెవరు సేవ్ చేస్తారు చెప్పు అని అంటాడు మహేంద్ర. ఏదేమైనా వసుధార విషయంలో అందరి నోర్లు మూయించావు అని అంటాడు మహేంద్ర. అవును ఇందాక వసుధార ఏడుస్తూ వెళ్ళింది అసలేం జరిగింది తనకు వాస్తవం చెప్పాను డాడ్ అని అంటాడు రిషి. అప్పుడు రిషి అందరి ముందు వసుధారకు నేను భర్త అని నేను తనకోసం చెప్పాను కానీ తను నా భార్య కాదు అన్న వాస్తవాన్ని చెప్పాను అనడంతో మహేంద్ర ఆశ్చర్యపోతాడు.
ఏం మాట్లాడుతున్నావ్ రిషి అనడంతో డాడ్ కాస్త టెక్నికల్ గా లాజికల్ గా ఆలోచించండి. తనకు తానుగా మెడలో వేసుకున్న తాళికి నేను ఎలా బాధ్యుని అవుతాను అని ప్రశ్నిస్తాడు రిషి. ఇలా ఆలోచించావేంటి రిషి వసుధార కు కూడా ఇలాగే చెప్పావా అనగా ఇంతకంటే క్లారిటీగా చెప్పాను అంటాడు రిషి. ఏంటి రిషి ఇది అందరి ముందు తనని పొగిడావు సంతోషపెట్టావు మళ్లీ ఇలా మాట్లాడటం కరెక్టేనా అని అడుగుతాడు మహేంద్ర. తను ఆ క్షణంలో నన్ను తలుచుకొని నన్ను ఊహించుకొని మెడలో తాళి వేసుకుంది కాబట్టి నేను తనని కాపాడాను. అందుకు నేను గర్వపడుతున్నాను కూడా మరి ఇలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు రిషి తను నీ భార్య కదా ప్రేమించావు కదా అనగా ఇప్పటికీ ప్రేమిస్తున్నాను అనడంతో మరి తనను ఎందుకు బాధ పెట్టాలి అనగా తను చేసింది తప్పు డాడ్ అని అంటాడు రిషి.
అలా వారిద్దరు వసుధార గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు జగతి వసుధార ఇద్దరు కారులో వెళ్తూ ఉండగా వసుధార రిషి అన్న మాటలు తలుచుకొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు వసుధార బాధగా మాట్లాడగా అసలు వసుధారకి ఏమయింది ఇలా మాట్లాడుతోంది అని ఆలోచించుకుంటూ ఉంటుంది జగతి అనుకున్నాడు. అప్పుడు జగతి కారు ఆపడంతో ఎందుకు మేడం కారు ఆపారు అనగా వెనకాల రిషి వస్తున్నాడు వసు అనడంతో ఇంతలో అక్కడికి రిషి కారు ఆపి కారు దిగి వసు దగ్గరికి వచ్చి మాట్లాడాలి అనడంతో మాట్లాడడానికి ఏమీ లేదు సార్ అనడంతో కాలేజీ నుంచి వచ్చేయడం ఏంటి పర్మిషన్ అడగాలి కదా అనడంతో అప్పుడు వసుధార కారు దిగి రిషికి తలనొప్పిగా ఉంది లీవ్ కావాలి అని మెయిల్ చేస్తుంది.
అప్పుడు వసు,రిషి ఇద్దరు ఒకరినొకరు వాదించుకుంటూ ఉండగా వీరిద్దరిని అర్థం చేసుకోవడం ఎవరి తరం కాదు అని అనుకుంటూ ఉంటుంది జగతి. ఇప్పుడు ఎందుకు సార్ నన్ను వేధిస్తున్నారు అనడంతో వసుధార వేధింపులు అన్నమాట చాలా పెద్దది తెలుసా అని అంటాడు రిషి. అప్పుడు వాళ్ళిద్దరూ వాదించుకుంటూ ఉండగా జగతి అర్థంకాక వాళ్ళిద్దరు వైపు అలాగే చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏమంటావు అనగా బాయ్ అంటాను సార్ అనగా అప్పుడు రిషి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు జగతి వసుధార దగ్గరికి వెళ్లి అసలు ఏమైంది వసు నాకేం అర్థం కావడం లేదు అనడంతో నాకు కూడా అర్థం కావడం లేదు మేడం అని అంటుంది వసుధార. అప్పుడు జగతి ఎంతలా అడిగినా కూడా వసుధార దొంగ తిరుగుడుగా సమాధానం చెబుతూ ఉంటుంది.
తర్వాత జగతి, వసుధార ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరొకవైపు దేవయాని జరిగిన విషయాలు తలచుకొని కోపంతో రగిలిపోతూ ఉండగా ఇంతలోనే అక్కడికి ధరణి పలకరించగా ఆమెపై సీరియస్ అవుతుంది. ఇంతలోనే అక్కడికి రిషి వస్తాడు. అప్పుడు కావాలనే దేవయాని రిషిని అవాయిడ్ చేస్తూ పిలుస్తున్న పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఫణింద్ర రిషి వచ్చాడా అనడంతో ఆ వచ్చాడు ఒకప్పటి రిషి కాదు పెద్దవాడు అయిపోయాడు తానే తీసుకున్నాడు అంటూ ఫింగర్ తింగరిగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలోనే రిషి అక్కడికి వచ్చి పెద్దమ్మ అని పిలుస్తాడు.
