తెలుగు సినీ పరిశ్రమలో సక్సెస్ ఫుల్ గా 30 వసంతాలు పూర్తి చేసుకుని, హీరోగా, విలన్ గా, కేరక్టర్ ఆర్టిస్ట్ గా అన్ని రకాల పాత్రల్లో తనదైన శైలితో ఆకట్టుకుని తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు జగపతిబాబు. ముఖ్యంగా మహిళల్లో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న జగపతిబాబు గత కొన్ని రోజులుగా రోడ్డెక్కారు. 

 

పంచెకట్టుతో సామాన్యునిలా రోడ్డుపై తిరుగుతూ తాను ఎందుకలా చేస్తున్నాడో చెప్పకుండా, ఎవరికీ అర్థం కాకుండా నడక సాగించాడు. ప్రస్థుుతం రంగస్థలం సినిమాలో జగపతిబాబు కీలకపాత్రలో నటిస్తున్నారు. రంగస్థలం తో పాటు పలు సినిమాల్లో నటిస్తున్నారు.

 

ఇక తాను ఎందుకు రోడ్డుపై నడవాల్సి వచ్చిందో చెప్పేందుకు జగపతిబాబు రెడీ అయ్యారు. అయితే తెలుగు సినీ పరిశ్రమను ఆంధ్రాకు తరలించాలనే కోరికను ప్రజలకు తెలిపేందుకే ఆ నడక అని ప్రాధమికంగా తెలుస్తోంది. మరి కారణాలేంటో ఆయన ఈరోజు మీడియా సమావేశంలో వెల్లడిస్తారని తెలుస్తోంది.

 

పైరసీని అరికట్టడానికి అంతా సహకరించాలని కోరేందుకు తప్ప పరిశ్రమను తరలించడంపై జగపతిబాబుకు ప్రత్యేకమైన ఆలోచనలేమీ లేవని ఆయన సన్నిహుతులు కొందరు వాదిస్తున్నారు. మరి అసలు కారణం ఏంటో చూడాలి.