చలాకీ చంటికి తృటిలో తప్పిన ప్రమాదం

jabaradasth comedy actor chalanki chanti narrow escape from accident
Highlights

ధ్వంసమైన కారు

జబర్ధస్త్ కామెడీ షోతో పాపులారిటీ సంపాదించుకున్న నటుడు చలాకీ చంటి. ప్రస్తుతం ఆయన పలు టీవీ షోలోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. మంగళవారం  ఉదయం ఆయన  కారుకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చంటి తృటిలో తప్పించుకున్నారు.

మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రం 44వ జాతీయరహదారిపై ఆయన ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి మరో కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. కాగా ఈ ప్రమాదం నుంచి చంటి సురక్షితంగా బయటపడ్డాడు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

loader