పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ విడుదల తేదీపై స్పష్టత వచ్చింది. సంక్రాంతికే భీమ్లా నాయక్ విడుదల అంటూ చిత్ర యూనిట్ అధికారికంగా తెలియజేసింది.

చాలా రోజుల ముందే సంక్రాంతి చిత్రాల ప్రకటన ముగిసింది. మహేష్ సర్కారు వారి పాట (Sarkaru vaari paata) , ప్రభాస్ రాధే శ్యామ్ (Radhe shyam) , పవన్ భీమ్లా నాయక్ సంక్రాంతి బరిలో దిగుతున్నట్లు వెల్లడించారు. అనూహ్యంగా ఆర్ ఆర్ ఆర్ విడుదల తేదీ 2021అక్టోబర్ 13 నుండి 2022 జనవరి 7కి మారడంతో అసలు సమస్య వచ్చి పడింది. దీంతో సంక్రాంతి చిత్రాలు విడుదల పోస్ట్ పోన్ చేసుకొనున్నాయని ప్రచారం మొదలైంది. ముఖ్యంగా భీమ్లా నాయక్, సర్కారు వారి పాట చిత్రాలు సంక్రాంతి బరి నుండి తప్పుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి.


ఈ ఊహగానాలు నిజం చేస్తూ... సర్కారు వారి పాట సమ్మర్ కి పోస్ట్ పోన్ అయినట్లు అధికారిక ప్రకటన రావడం జరిగింది. దీనితో భీమ్లా నాయక్ కూడా అదే బాటపడుతుందని అందరూ ఊహించారు. మేకర్స్ కూడా దాదాపు నిర్ణయం తీసుకున్నారట. అయితే భీమ్లా నాయక్ (Bheemla nayak) అనుకున్న ప్రకారం జనవరి 12న విడుదల కావాలని ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. సోషల్ మీడియా వేదికగా భీమ్లా నాయక్ విడుదల పోస్ట్ పోన్ చేయడానికి వీలులేదని కామెంట్స్ రూపంలో తమ నిర్ణయం తెలియజేశారు. 

Also read Bheemla nayak postpone ?: వెనక్కి తగ్గనున్న పవన్‌ కళ్యాణ్‌.. వెనకాల జగన్‌.. అసలు కారణాలివే?
మొత్తంగా ఫ్యాన్స్ డిమాండ్ కి మేకర్స్ తలొగ్గినట్లు తెలుస్తుంది. సంక్రాంతి బరిలోనే భీమ్లా నాయక్ అంటూ నేడు అధికారిక పోస్టర్ విడుదల చేశారు. దీనితో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. భీమ్లా నాయక్ విడుదలపై స్పష్టత వచ్చిన నేపథ్యంలో ఈ సంక్రాంతి కి మూడు బడా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడనున్నాయి. ఆర్ ఆర్ ఆర్, భీమ్లా నాయక్, రాధే శ్యామ్ చిత్రాలు 2022 సంక్రాంతి బరిలో దిగనున్నాయి. 

Also read పవన్ కండీషన్ కు అనీల్ రావిపూడి లాక్ అవుతాడా?
ఇక దర్శకుడు సాగర్ కే చంద్ర భీమ్లా నాయక్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్నారు. ఆయన ఓ పాట కూడా రాయడం విశేషం. మలయాళ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోశియుమ్ తెలుగు రీమేక్ గా భీమ్లా నాయక్ తెరకెక్కుతుంది. రానా మరో హీరోగా నటిస్తున్నారు. పవన్ కి జంటగా నిత్యా మీనన్ నటిస్తున్నారు. పవన్ మరోమారు ఈ చిత్రంలో పోలీస్ రోల్ చేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. 

Scroll to load tweet…