MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Bheemla nayak postpone ?: వెనక్కి తగ్గనున్న పవన్‌ కళ్యాణ్‌.. వెనకాల జగన్‌.. అసలు కారణాలివే?

Bheemla nayak postpone ?: వెనక్కి తగ్గనున్న పవన్‌ కళ్యాణ్‌.. వెనకాల జగన్‌.. అసలు కారణాలివే?

పవన్‌ కళ్యాణ్‌, రానా కలిసి నటిస్తున్న `భీమ్లా నాయక్‌` సంక్రాంతి బరిలో దిగిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు వెనక్కి తగ్గుతున్నాడట. అనేక ఒత్తిళ్ల మేరకు ఆయన సంక్రాంతి నుంచి వెళ్లిపోతున్నాడనే వార్త ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది.   

3 Min read
Author : Aithagoni Raju
| Updated : Nov 14 2021, 03:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

`వకీల్‌సాబ్‌`(Vakeel Saab) చిత్రంతో అదిరిపోయేలా రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan).. అదే ఊపులో నాలుగు సినిమాలు చేస్తున్నారు. అందులో ఇమ్మిడియెట్‌గా రిలీజ్‌ కాబోతుంది `భీమ్లా నాయక్‌`(Bheemla Nayak) సినిమా. ఇది మలయాళంలో హిట్‌ అయిన `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` చిత్రానికి రీమేక్. సాగర్‌ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్‌ మాటలు, కథనం అందిస్తున్నారు. ఈ సినిమాలో రానా(Rana) మరో హీరో. ఇద్దరు ఈగోయిస్టుల మధ్య జరిగే గొడవ ప్రధానంగా ఈ సినిమా సాగబోతుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ లు, పాటలు సినిమాలపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇందులో పవన్‌, రానా ఇద్దరూ పోటీ పోటీగా నటిస్తున్నట్టు ఆయా గ్లింప్స్ ని చూస్తుంటే అర్థమవుతుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కాబోతుంది. `ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR Movie) కారణంగా Bheemla Nayak వాయిదా పడుతున్నట్టు వార్తలొచ్చినా అదేం లేదని సంక్రాంతికి రావడం మాత్రం పక్కా అనే విషయం తేల్చేశారు. కానీ ఇప్పుడు సమీకరణాలు మారిపోతున్నాయి. `భీమ్లానాయక్‌` ని సంక్రాంతి బరి తప్పుకుంటుందట. మరోసారి వాయిదా పడుతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాని సంక్రాంతి పోటీ నుంచి తప్పించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇందులో రాజకీయ ప్రమేయాలు కూడా ఉండటం చర్చనీయాంశంగా మారుతుంది.

38

RRR Movie` సినిమా కారణంగా, జగన్‌ వైఖరి కారణంగా ఈ సినిమా వాయిదా పడే అవకాశాలున్నాయంటున్నారు. `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 7న విడుదల కాబోతుంది. ఇది దాదాపు నాలుగువందల కోట్ల బడ్జెట్‌తో రూపొందిన సినిమా. పదికిపైగా లాంగ్వేజెస్‌లో రిలీజ్‌ కాబోతుంది. భారీ బడ్జెట్‌ కావడంతో ఆ స్థాయి కలెక్షన్లు రావాలంటే భారీగానే రిలీజ్‌ ఉండాలి. పెద్ద సినిమాల పోటీ ఉండకూడదు.ఇప్పుడు మిగిలిన భాషల్లో ఈ సినిమాకి సమస్య లేకపోయినా తెలుగులోనే ప్రధానంగా `భీమ్లా నాయక్‌`, `రాధేశ్యామ్‌`(Radheshyam) చిత్రాలున్నాయి. మహేష్‌ బాబు నటించిన `సర్కారు వారి పాట చిత్రం కూడా సంక్రాంతి బరిలోనేఉన్నా.. `ఆర్ఆర్ఆర్‌` రిక్వెస్ట్ మేరకు ఇది ఏప్రిల్‌(april 1st)కి వెళ్లిపోయింది. 

48

కానీ `భీమ్లా నాయక్‌`, `రాధేశ్యామ్‌` చిత్రాలు పోటీలో ఉన్నాయి. అయితే ఇందులో `రాధేశ్యామ్‌` చిత్రం కూడా వరల్డ్ వైడ్‌ రిలీజ్‌ ఉంది. ఇది కూడా భారీ బడ్జెట్‌ చిత్రం. దీంతో వాళ్లు కూడా ఈ పోటీ నుంచి, సంక్రాంతి
బరి నుంచి తప్పుకునేందుకు ఒప్పుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి చూపు `భీమ్లా నాయక్‌`పైనే పడింది. ఈ సినిమా వాయిదా వేసుకోవాలని `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్‌, ఇండస్ట్రీ పెద్దలు తీవ్ర ప్రయత్నాలు
చేస్తున్నారట. 
 

58

దీనికి టికెట్లు రేట్లు(Ticket Rates) కూడా మరో కారణమని తెలుస్తుంది. ఏపిలో టికెట్ రేట్లు తక్కువగా ఉన్నాయి. ఇదే విషయంలో `వకీల్‌సాబ్‌` సినిమా రిలీజ్‌ విషయంలో ఏపీ ప్రభుత్వానికి, చిత్ర యూనిట్‌కి మధ్య తీవ్రమైన చర్చ జరిగింది. పవన్‌ కళ్యాణ్ ఏపీలో అక్కడి జగన్‌(Cm Jagan) ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న నేపథ్యంలో పొలిటికల్‌ పరిణామాల కారణంగా పవన్‌ సినిమాని అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు `భీమ్లా నాయక్‌` విషయంలోనూ అదే జరగబోతుందని తెలుస్తుంది. `ఆర్‌ఆర్‌ఆర్‌`, `రాధేశ్యామ్‌` చిత్రాలు టికెట్ల రేట్లు పెంచుకోవాలని భావిస్తున్నాయి. తాము పెట్టిన బడ్జెట్‌ మించి కలెక్షన్లు రావాలంటే టికెట్లు రేట్లు ఎక్కువగా ఉండాల్సిందే. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వంతో మంతనాలు జరుగుతున్నాయి. అవసరమైతే కోర్ట్ కి కూడా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారట `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్. 

68

సంక్రాంతి బరిలోనే పవన్‌ కళ్యాణ్‌ `భీమ్లా నాయక్‌` చిత్రం ఉండటంతో ఏపీ ప్రభుత్వం టికెట్లు రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వకపోవచ్చని తెలుస్తుంది. `రిపబ్లిక్‌` సినిమా ఈవెంట్‌లో ఏపీ ప్రభుత్వంపై ఫైర్‌ అయ్యాడు పవన్‌. ఇండస్ట్రీ వైపు వస్తే మాడి మస్సైపోతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీ వాళ్లు దీనిపై ప్రతిఘటించాలని తెలిపారు. సినిమాల్లో వచ్చే ఆదాయన్ని ప్రభుత్వం తన ఖజానాలో వేసుకోవాలని భావిస్తుందని ఆరోపించారు. టికెట్ల రేట్లపై కూడా ఆయన విమర్శకులు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో జగన్‌ మొండి వైఖరితో ఉండే అవకాశాలున్నాయని ఓ టాక్‌ నడుస్తుంది. పవన్‌ సినిమా ఉంటే టికెట్ల రేట్లు పెంచుకునేందుకు జగన్‌ అనుమతించరని అంటున్నారు.
 

78

ఇలాంటి పరిస్థితిలో ఏపీలో టికెట్లు రేట్లు పెంచడం కష్టం. అందుకు సీఎం జగన్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరనే టాక్ వినిపిస్తుంది. దీంతో ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ని బతిమాలుకుంటున్నారట ఇండస్ట్రీ పెద్దలు.
`భీమ్లా నాయక్‌` సినిమా వాయిదా పడితే `ఆర్‌ఆర్‌ఆర్‌`, `రాధేశ్యామ్‌` చిత్రాలు మాత్రమే సంక్రాంతి బరిలో ఉంటాయి. దీంతో ఏపీ ప్రభుత్వం కూడా టికెట్ రేట్లని తాత్కాలికంగా పెంచుకునేందుకు అనుమతి వచ్చే
అవకాశాలున్నాయట. అందులో భాగంగానే `ఆర్‌ఆర్‌ఆర్‌` యూనిట్‌, `రాధేశ్యామ్‌` యూనిట్‌తోపాటు ఇండస్ట్రీ పెద్దలు కూడా `భీమ్లా నాయక్‌` నిర్మాతలతో, పవన్ కళ్యాణ్‌తో తీవ్రంగా చర్చిస్తున్నారని, ఆయన్ని
వెనక్కితగ్గేలా ప్రయత్నాలు చేస్తున్నారని ఫిల్మ్ నగర్‌ టాక్‌. 

88

 `రిపబ్లిక్‌` సినిమా ఫంక్షన్‌లో పవన్‌ మాట్లాడుతూ.. `అవసరమైతే నా సినిమాలను ఆపుకోండి.. కానీ ఇతర సినిమాలను ఇబ్బంది పెట్టొంద`ని కూడా వ్యాఖ్యానించ్చాడు. ఇప్పుడితే విషయాన్ని ఇండస్ట్రీ పెద్దలు హైలైట్‌ చేస్తూ పవన్‌ సినిమా కోసం తమ సినిమాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి నెలకొందని, అందుకే ఇండస్ట్రీ మేలు కోసం పవన్ వెనక్కి తగ్గాలని రిక్వెస్ట్ చేస్తున్నారట. మరి పవన్‌, `భీమ్లా నాయక్‌` టీమ్‌ వెనక్కి తగ్గుతుందా? మేం తగ్గేదెలే అంటూ ముందుకు సాగుతారా? అన్నది వేచి చూడాలి. కానీ ఇప్పుడీ డిస్కషన్‌ మాత్రం ఓ వైపు తెలుగు చిత్ర పరిశ్రమలో, మరోవైపు ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారడం విశేషం. 

also read: National Crush: రష్మిక మందన్నాకి నిధి అగర్వాల్ దిమ్మతిరిగే షాక్‌‌.. పవన్‌ కళ్యాణ్‌ని చూసుకునేనా ఈ దూకుడు?

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
పవన్ కళ్యాణ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Recommended image2
Chaitra Rai: వర్షిణి, సుధీర్ హైడ్రామా అట్టర్ ఫ్లాప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి చైత్ర రాయ్ అవుట్, మరో ఎలిమినేషన్
Recommended image3
Shrimad Bhagavatam: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు ఏడు భాగాలుగా విష్ణువు కథ.. భారీ స్కేల్‌లో సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved