టాలీవుడ్ నిర్మాతల కార్యాలయాలు, ఇండ్లపై ఐటీ దాడులు

First Published 17, Jan 2018, 4:29 PM IST
it raids on tollywood production houses
Highlights
  • టాలీవుడ్ నిర్మాతల కార్యాలయాలు, ఇండ్లపై ఐటీ దాడులు
  • టీడీఎస్ లెక్కలపై ఆరాతీస్తున్న ఐటీశాఖ
  • సోదాలు నిజమేనంటున్న సినీ  నిర్మాణ సంస్థలు
  • ఏం జరుగుతుందోననే సస్పెన్స్ క్రియేట్ చేస్తున్న రైడ్స్

హైదరాబాద్ లోని పలు సినీ నిర్మాణ సంస్థల కార్యాలయాల్లో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు సురేష్ ప్రొడక్షన్స్, భవ్య క్రియేషన్స్, సికె ఎంటర్ టైన్మెంట్స్, డీవీవీ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్, హారికా హాసిని క్రియేషన్స్ తదితర కార్యాలయాలతోపాటు నిర్మాతలు డి.సురేష్, సి.కల్యాణ్, శరత్ మరార్, రాధాకృష్ణ, డీవీవీ దానయ్య, దిల్ రాజు తదితరుల కార్యాలయాలు, ఇండ్లలో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. దీనిపై నిర్మాతలు కూడా క్లారిటీ ఇస్తున్నారు. ఐటీ తనిఖీలు వాస్తవమేనని ఆదాయపు పన్ను చెల్లింపుల్లో సరైన లెక్కలు ఇచ్చారా లేదా అనే వివరాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సోదాలు సాయంత్రం వరకు కొనసాగే అవకాశాలున్నాయి. ఇఖ ఈ సోదాల్లో ఏం తేలుతుందోననే ఉత్కంఠ నెలకొంది.

loader