షాక్..! చరణ్ నిర్మాతలపై ఐటీ రైడ్స్.?

First Published 27, Mar 2018, 11:44 AM IST
IT Raids on rangasthalam producers
Highlights
రంగస్థలం నిర్మాతలపై ఐటి రైడ్స్ ?

 రంగస్థలం విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై ఐటి దాడులు జరిగాయన్న వార్త ఇప్పుడు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇది నిజమనే చెప్పేఆధారాలు ఏవి లేనప్పటికీ ఈ వేసవిలో వస్తున్న క్రేజీ సినిమాల్లో ఇదే మొదటి ప్లేస్ లో ఉంది కాబట్టి బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతోంది. ఇది దృష్టిలో ఉంచుకునే ఆదాయపు పన్ను శాఖ అధికారులు పలు సోదాలు నిర్వహించినట్టు సమాచారం. ఇప్పటికే బిజినెస్ పూర్తి చేసుకున్న రంగస్థలంకు ఈ మూడు రోజులు కీలక దశ కనక వ్యాపార లావాదేవీలు విస్తృతంగా ఉంటాయి. ఈ నేపధ్యంలోనే ఐటి దాడులు  జరిగినట్టు తెలుస్తోంది. 

రంగస్థలంతో పాటు మైత్రి సంస్థ నాగ చైతన్య తో సవ్యసాచి కూడా నిర్మిస్తోంది. ఇది ఇప్పుడు సినిమా వర్గాల్లో పెద్ద చర్చకే దారి తీసింది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ దీనికి సంబంధించి నిర్ధారణ చేయాల్సి ఉంది. దీనికి సంబంధించిన దస్త్రాలు కూడా పరిశీలించినట్టు సమాచారం. కొన్ని కీలకమైన ఫైల్స్ జప్తు చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. డాక్యుమెంట్స్ పూర్తి స్థాయిలో సరైన వివరాలతో లేకపోవడం వల్ల ఐటి శాఖ అధికారులు కాస్త గట్టిగానే నిలదీసినట్టు సమాచారం.

loader