పవన్ కోసం రెడీ చేసుకున్న కథని ఎన్టీఆర్ తో చేస్తున్నారు..!

is trivikram doing kobali with tarak
Highlights

ప‌వ‌న్ స్థానంలో ఎన్టీఆర్..!

అజ్ఞాత‌వాసి కంటే ముందే ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కోసం ఓ మంచి క‌థను రెడీ చేశాడు. అదే కోబ‌లి క‌థ‌. ఇది విప్ల‌వ సాహిత్యం ఆధారంగా రాశార‌ని, ప‌వ‌న్‌కు విప‌రీతంగా న‌చ్చింద‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. అయితే, కొన్ని ప‌రిస్థితుల కార‌ణంగా అది సాధ్యం ఆలేదు. దీంతో ఆ సినిమా మ‌రుగున ప‌డింది.

తాజాగా లీకైన విషయం ఏమిటంటే..! ప‌వ‌న్ క‌ల్యాణ్ కోసం రెడీ చేసిన కోబ‌లి క‌థ‌ను జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో చేస్తున్న ఇనిమా స్క్రిప్ట్‌లో జోడించిన‌ట్లు స‌మాచారం. దాదాపు ఫ్యాక్ష‌న్ నేప‌థ్యంలో వ‌స్తున్న అర‌వింద సినిమాలో అప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో తీద్దామ‌నుకున్న సీన్ల‌ను ఇప్పుడు ఎన్టీఆర్‌తో తీసేందుకు త్రివిక్ర‌మ్ రెడీ అయిపోయాడు. అజ్ఞాత‌వాసి సినిమా ప్లాప్ కావ‌డంతో త్రివిక్ర‌మ్ అత్య‌ద్భుత‌మైన కోబ‌లి క‌థ‌ను ఎన్టీఆర్ సినిమాలో క‌లిపిన‌ట్లు తెలిసింది. ఇలా ప‌వ‌న్ కోసం త్రివిక్ర‌మ్ రెడీ చేసిన క‌థ‌లో ఎన్టీఆర్ న‌టించ‌నున్నాడ‌న్న మాట‌.

loader