తల్లి కాబోతున్న ఇలియానా.?

First Published 17, Apr 2018, 12:05 PM IST
Is Illeana Pregnant
Highlights

ఇలియాన తల్లి కాబోతుందా.?

టాలీవుడ్ లో ఒకప్పుడు ఒక ఊపు ఊపేసిన ఇలియాన సౌత్ ని వదిలి టోటల్ గా బాలీవుడ్ లో మకాం పెట్టేసింది. అక్కడ ఆస్ట్రేలియాకు చెందిన ఫొటోగ్రాఫర్‌ ఆండ్రూ నీబోన్‌ను ఇలియానా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఇలియానా తల్లి కాబోతున్నారట. బాలీవుడ్ వర్గాలు కూడా అవుననే అంటున్నాయి. ఈ విషయాన్ని ఆమె నేరుగా వెల్లడించకపోయినా.. సోషల్‌మీడియాలో తన ప్రియుడితో కలిసి దిగిన ఫొటోలను పోస్ట్‌ చేస్తూ ‘హబ్బీ’ అని సంబోధిస్తుంటారు.

రీసెంట్ గా ఆండ్రూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన భార్య ఫొటోను షేర్‌ చేశారు. ఫొటోలో ఇలియానా బాత్‌టబ్‌లో సేదతీరుతూ కాఫీ తాగుతూ కన్పించారు. ‘ఇలియానా ఒంటరిగా మధురమైన సమయాన్ని గడుపుతున్నారు’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. ఇప్పటివరకు పెళ్లి గురించే ఏ క్లారిటీ ఇవ్వని ఇలియానా ఇక ఈ విషయం గురించి ఏమని చెప్తారో లేదో  చూడాలి.


 

loader