ఈ ఏడాదిలోనే అనుష్క పెళ్లి?

First Published 11, Jun 2018, 6:23 PM IST
Is Anushka Shetty getting married soon?
Highlights

దక్షినాది స్టార్ హీరోయిన్ అనుష్క త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతుందనే వార్తలు ఇప్పుడు హాట్ 

దక్షినాది స్టార్ హీరోయిన్ అనుష్క త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతుందనే వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. చాలా రోజులుగా అనుష్క, ప్రభాస్ ప్రేమలో ఉన్నారని పెళ్లి చేసుకోబోతున్నట్లు రకరకాల ఊహాగానాలు వినిపించాయి.

అయితే ఈ విషయంలో ఎలాంటి నిజం లేదని తామిద్దరం కేవలం మంచి స్నేహితులం మాత్రమేనని స్పష్టం చేశారు. తాజాగా అనుష్కకు పెళ్లి అంటూ ఓ నేషనల్ మీడియా వార్తలను ప్రచురించింది. ఆ వార్తల ప్రకారం ఆమెకు ఈ ఏడాది చివరిలోగా పెళ్లి జరగనుందని తెలుస్తోంది. పెళ్లికి ముందు పలు ఆలయాలను సందర్శిస్తూ ఆమె పూజలు నిర్వహిస్తోందని రాసుకొచ్చారు.

ఇక అనుష్క తల్లితండ్రులు ఆమెకు పెళ్లికొడుకుని వెతికే పనిలో ఉన్నారని సరైన జోడీ దొరికిన వెంటనే పెళ్లి పనులు మొదలుపెట్టాలని చూస్తున్నారట. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాల్సివుంది!

loader