నిమ్మకూరులో ఎన్టీఅర్ ప్రేమాయణం!

First Published 22, May 2018, 11:21 AM IST
interesting love story in ntr biopic
Highlights

దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా 'ఎన్టీఆర్' బయోపిక్ ను 

దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా 'ఎన్టీఆర్' బయోపిక్ ను రూపొందించనున్నసంగతి తెలిసిందే. దర్శకుడు తేజ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోగా, ఆయన స్థానంలో క్రిష్ వచ్చి చేరినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదే ఎన్టీఆర్ లవ్ స్టోరీ. 

నిమ్మకూరులో నూనూగు మీసాల ఎన్టీఆర్ నడిపించిన ప్రేమకథ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. ఎన్టీఆర్ యుక్త వయసులో ఉన్నప్పుడు నిమ్మకూరులో తమ ఇంటికి పాలు పోయడానికి వచ్చే అమ్మాయిని ఇష్టపడేవారట. ఈ విషయం ఇంట్లో తెలిసి ఎన్టీఆర్ తల్లితండ్రులు బసవతారకంని ఇచ్చి పెళ్లి చేశారట. నిజానికి ఆ పెళ్లి ఎన్టీఆర్ కు ఇష్టం లేకుండానే చేసుకున్నారట.

కానీ పెళ్లైన తరువాత మాత్రం ఆయన భార్యను ఎంతో ప్రేమగా చూసుకున్నారు. సినిమాలో ఈ నిమ్మకూరు లవ్ స్టోరీను టచ్ చేయబోతున్నారని తెలుస్తోంది. అలానే సినిమా మొదటి నలభై నిమిషాల్లో యంగ్ ఎన్టీఅర్ పాత్రలో ఈ తరానికి చెందిన యంగ్ హీరోలు ఎవరైనా కనిపించే అవకాశాలు ఉన్నాయి.  

loader