2010లో ఆగిపోయిన రాంచరణ్, కాజల్ మూవీ.. మెగా పవర్ స్టార్ డ్రీమ్ నెరవేరబోతోంది

ఒకప్పుడు రాంచరణ్ కల నెరవేరకుండా మధ్యలోనే ఆగిపోయింది. ఎట్టకేలకు తన డ్రీమ్ నెరవేర్చుకునే అవకాశం రాంచరణ్ కు దక్కింది. ఆ ఆసక్తికర వివరాలు ఇవే. 

 

Interesting details about Ram Charan dream project

ప్రతి నటుడికి అలాంటి చిత్రం చేయాలి, ఇలాంటి రోల్ లో నటించాలి అనే డ్రీమ్ ఉంటుంది. డ్రీమ్స్ అంటే ఎవరికైనా సాదాసీదాగా ఉండవు. కష్టంతో కూడుకున్నవిగానే ఉంటాయి. తమ లైఫ్ లో ఎప్పటికైనా డ్రీమ్ నెరవేర్చుకోవాలని అంతా ప్రయత్నిస్తుంటారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ కి కూడా ఓ డ్రీమ్ ఉంది. కెరీర్ లో ఎప్పటికైనా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ చిత్రంలో నటించాలనేది చరణ్ కల. ఈ విషయాన్ని రాంచరణ్ పలు సందర్భాల్లో వివరించారు. 

అయితే స్పోర్ట్స్ మూవీలో నటించే ఛాన్స్ Ram Charan కి కెరీర్ ఆరంభంలోనే దక్కింది. 2007లో చిరుతతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన చరణ్.. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మగధీర చిత్రంతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాశారు. ఇక 2010లో చరణ్ ఆరెంజ్ మూవీతో పాటు తమిళ దర్శకుడు ధరణి దర్శకత్వంలో 'Merupu' అనే చిత్రాన్ని సైన్ చేశాడు. ధరణి రాంచరణ్ కోసం ఫుట్ బాల్ క్రీడ నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ స్టోరీ సిద్ధం చేసుకున్నారు. ఆర్ బి చౌదరి నిర్మాత. అందాల చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కూడా ఫిక్సైంది. పూజా కార్యక్రమాలతో సినిమా లాంచ్ కూడా అయింది. 

కానీ అనుకోని కారణాల వల్ల ఆ చిత్రం ఆగిపోయింది. ఆ తర్వాత చరణ్ కు మళ్ళీ స్పోర్ట్స్ మూవీలో నటించే ఛాన్స్ దక్కలేదు. ఎట్టకేలకు రాంచరణ్ తన డ్రీమ్ నెరవేర్చుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. యువీ క్రియేషన్స్ బ్యానర్ లో గౌతమ్ తిన్ననూరి దర్శకుడిగా రాంచరణ్ చిత్రం ఖరారైన సంగతి తెలిసిందే. జెర్సీ చిత్రంతో గౌతమ్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. కథలో ఎమోషన్ ని హైలైట్ చేస్తూ మెప్పించే దర్శకుడిగా గౌతమ్ గుర్తింపు పొందారు. 

రాంచరణ్ కోసం గౌతమ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో పవర్ ఫుల్ కథని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో గౌతమ్ తిన్ననూరి రూపంలో రాంచరణ్ కల నెరవేరబోతోంది అంటూ ఇండస్ట్రీలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. గౌతమ్ జెర్సీ చిత్రాన్ని క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కించి ప్రశంసలు దక్కించుకున్నాడు. నాని కెరీర్ బెస్ట్ మూవీస్ లో తప్పకుండా జెర్సీ ఉంటుంది. మరి రాంచరణ్ ని ఎలా చూపించబోతున్నాడో తెలుసుకోవాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే. 

ప్రస్తుతం రాంచరణ్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు రెడీ అవుతోంది. అలాగే శంకర్ దర్శకత్వంలోని చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతోంది. 

Also Read: Pooja hegde: బికినీలో బ్రేక్ ఫాస్ట్, సముద్రంలో జలకాలు.. మాల్దీవ్స్ తీరాన్ని అందాలతో వేడెక్కిస్తున్న పూజ హెగ్డే

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios