Pooja hegde: బికినీలో బ్రేక్ ఫాస్ట్, సముద్రంలో జలకాలు.. మాల్దీవ్స్ తీరాన్ని అందాలతో వేడెక్కిస్తున్న పూజ హెగ్డే
చేతినిండా సినిమాలు, తీరిక లేని షెడ్యూల్స్... అలసిన మనసుకు, శరీరానికి కొంత విరామం కావాలి. దాని కోసం విహారమే సరైన పరిష్కారం. అందుకే దీవుల దేశం మాల్దీవ్స్ చెక్కేసింది స్టార్ లేడీ పూజా హెగ్డే.
ప్రస్తుతం పూజా హెగ్డే (Pooja hegde) మాల్దీవ్స్ లో ఉన్నారు. ప్రశాంతమైన సాగర తీరంలో హాయిగా సేద తీరుతున్నారు. స్వచ్ఛమైన సముద్రపు గాలిని పీలుస్తూ, ఇష్టమైన ఆహారం తింటూ.. ఆహ్లదకరమైన ప్రదేశాల్లో విహరిస్తున్నారు. సముద్రం మధ్యలో ఉండే హోటల్ గదులలో సేదతీరుతూ జీవితాన్ని జోష్ ఫుల్ గా మలుచుకుంటున్నారు.
పూజా హెగ్డే తన విహారానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా బికినీ ధరించిన పూజా నీటిలో బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నారు. రుచికరమైన ఆహార పదార్ధాలను ఆరు బయట ఆరగిస్తున్నారు. ఈ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన పూజా, ఓ సాధారణ అమ్మాయి అసాధారణ అనుభవాలు అంటూ... కామెంట్ చేసింది.
తాను నటిస్తున్న చిత్రాల షూటింగ్స్ నుండి కొంచెం బ్రేక్ దొరికిన నేపథ్యంలో పూజా హెగ్డే మాల్దీవ్స్ (Maldives) విహారానికి వెళ్లినట్లు తెలుస్తోంది. మరి పూజ హెగ్డే వెకేషన్ అక్కడ ఎన్ని రోజులు సాగుతుందో చూడాలి.
ఒక్క హిట్ అంటూ తపన పడిన అక్కినేని అఖిల్ దాహం కూడా పూజా తీర్చేసింది. పూజా తన సెంటిమెంట్ కొనసాగిస్తూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ రూపంలో మరో హిట్ కొట్టింది. ఈ సినిమా విజయం పూజా హెగ్డే పుణ్యమే అని పరిశ్రమ వర్గాలు చెప్పుకోవడం విశేషం.
చిరంజీవి-చరణ్ ల మల్టీ స్టారర్ ఆచార్య, ప్రభాస్ (Prabhas) రాధే శ్యామ్ వంటి భారీ ప్రాజెక్ట్స్ పూజా హెగ్డే ఖాతాలో ఉన్నాయి. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న రాధే శ్యామ్ (Radhe shyam) పై భారీ అంచనాలున్నాయి. దర్శకుడు రాధా కృష్ణ పీరియాడిక్ ఎమోషనల్ లవ్ డ్రామాగా రాధే శ్యామ్ తెరకెక్కించారు.ప్రభాస్ బర్త్ డే కానుకగా విడుదలైన రాధే శ్యామ్ టీజర్ ఆకట్టుకుంది.
ఇక ఆచార్య (Acharya) 2022 ఫిబ్రవరి 4న విడుదల కానుంది. దర్శకుడు కొరటాల శివ చిరు-చరణ్ హీరోలుగా తెరకెక్కించిన ఈ మల్టీస్టారర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. చరణ్ కి జంటగా నీలాంబరి అనే పల్లెటూరి అమ్మాయి పాత్ర చేస్తుంది పూజా హెగ్డే. అలాగే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ లేటెస్ట్ మూవీ బీస్ట్ చిత్రంలో పూజా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల కానుందంటూ ప్రచారం సాగుతుంది.
కాగా మహేష్ (Mahesh babu) తో దర్శకుడు త్రివిక్రమ్ మూవీ ప్రకటించగా... హీరోయిన్ గా పూజా పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. గతంలో మహేష్, పూజ కాంబినేషన్ లో వచ్చిన మహర్షి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అలాగే పవన్ తో హరీష్ శంకర్ చేస్తున్న భవదీయుడు భగత్ సింగ్ చిత్రంలో కూడా పూజా నటించే అవకాశం కలదు.
Also read Pooja Hegde: మాల్దీవుల్లో తన గది చూపిస్తూ పూజా హెగ్డే రచ్చ.. వాటికోసం అభిమానులు ఎదురుచూపులు..
Also read ఓటీటీలో ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్