ఆ సినిమాలు ఇండస్ట్రీ హిట్ కానీ…TRP రేటింగ్ డిసాస్టర్

First Published 24, Feb 2018, 5:40 PM IST
Industry Hit Movies got Worst TRP Ratings
Highlights
  • ఆ సినిమాలు ఇండస్ట్రీ హిట్ కానీ…TRP రేటింగ్ డిసాస్టర్

కోలివుడ్ విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మెర్సల్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే…131 కోట్ల షేర్ ని ఆ సినిమా టోటల్ రన్ లో అందుకుని ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది…అలాంటి సినిమా బుల్లితెరపై టెలికాస్ట్ అయిన సమయంలో కేవలం 8.1 TRP రేటింగ్ ని మాత్రమె సాధించి దిమ్మతిరిగే షాక్ ఇస్తూ డిసాస్టర్ TRP రేటింగ్ ని సాధించి షాక్ ఇచ్చింది. అదే సమయంలో ఇతర చానెల్ లో టెలికాస్ట్ అయిన మరో హిరో అజిత్ నటించిన వీరంకి 9.1 TRP రేటింగ్ రావడంతో విజయ్ మెర్సల్ బుల్లితెరపై డిసాస్టర్ అయిందని కోలివుడ్ లో చెప్పుకుంటున్నారు. అంతకుముందు చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 నే తీసుకున్నా 104 కోట్లు వసూల్ చేసిన సినిమా బుల్లితెరపై 7 TRP రేటింగ్ ని మాత్రమె సాధించింది.
 

loader