MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • రామ్ చరణ్ కి టీనేజ్ లో ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటో తెలుసా? మెగా మదర్ సురేఖ వెల్లడించిన టాప్ సీక్రెట్ ..?

రామ్ చరణ్ కి టీనేజ్ లో ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటో తెలుసా? మెగా మదర్ సురేఖ వెల్లడించిన టాప్ సీక్రెట్ ..?

మెగా పవర్ స్టార్ .. రామ్ చరణ్ కి పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ఉంది. చరణ్ చాలా కూల్ గా కామ్ గా, డిగ్నిటీతో కనిపిస్తుంటారు. కానీ ఈ గ్లోబల్ హీరోకు టీనేజ్ లో ఓ చిన్న బ్యాడ్ హ్యాబిట్ ఉందని మీకు తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 21 2026, 02:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రామ్ చరణ్ పాన్ ఇండియా క్రేజ్..
Image Credit : Instagram/ Ram Charan

రామ్ చరణ్ పాన్ ఇండియా క్రేజ్..

మగధీర సినిమాతో.. పాన్ ఇండియాకు పరిచయం అయిన రామ్ చరణ్... ట్రిపుల్ ఆర్ సినిమాతో.. పాన్ ఇండియా ఫేవరెట్ గా మారిపోయాడు. ఈసినిమాతో ఆస్కార్ సాధించి.. వరల్డ్ సినిమాను ఆకర్శించాడు. టైటానిక్, అవతార్ లాంటి అద్భుతాలు సృష్టించిన జేమ్స్ కామరాన్ లాంటి దర్శకుడితోనే శభాష్ అనిపించుకున్నాడు రామ్ చరణ్. 

పాన్ వరల్డ్ ఇమేజ్ ను సాధించిన ఈ హీరో.. ట్రిపుల్ ఆర్ తరువాత రెండు ప్లాప్ సినిమాలను ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆచార్యతో పాటు, గేమ్ ఛేంజర్ సినిమాతో డిజాస్టర్స్ ఫేస్ చేశాడు రామ్ చరణ్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రామ్ చరణ్ ప్రవర్తనకు అభిమానులు ఫిదా..
Image Credit : AlwaysRamcharan/instgram

రామ్ చరణ్ ప్రవర్తనకు అభిమానులు ఫిదా..

రామ్ చరణ్ గతంలో ఎలా ఉన్నా.. రంగస్థలం సినిమా అప్పటి నుంచి చాలా మారిపోయాడు. సినిమాలే కాదు.. ఆయనప్రవర్తన కూడా ఎంతో మారింది. యాక్టింగ్ విషయంలో కూడా తన మార్క్ నటనను మార్చుకుని.. అద్భుతాలు చేయడం స్టార్ట్ చేశాడు. 

రంగస్థలం సినిమాలో డీ గ్లామర్ రోల్ తో అలరించిన స్టార్ హీరో.. ఆతరువాత ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ ను సైతం డామినేట్ చేయగలిగే యాక్టింగ్ ను చూపించాడు చరణ్. అంతే కాదు పర్సనల్ గా కూడా అభిమానులతో కనెక్ట్ అవుతూ.. కూల్ గా కామ్ గా, ప్రతీ ఒక్కరిని ప్రేమగా పలకరిస్తూ.. చరణ్ ఇండస్ట్రీలో.. అభిమానుల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు.

35
రామ్ చరణ్ చిన్నప్పుడు ఎలా ఉండేవాడు?
Image Credit : Instagram/Ram Charan

రామ్ చరణ్ చిన్నప్పుడు ఎలా ఉండేవాడు?

రామ్ చరణ్ చిన్ననాటి సంగతుల గురించి ఆయన తల్లి సురేఖ కొణిదెల గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. చిన్నప్పటి నుంచే చరణ్ చాలా సైలెంట్, కామ్ గోయింగ్, సాఫ్ట్ స్వభావం కలిగిన వాడని ఆమె తెలిపారు. ఇతర పిల్లలలా ఎక్కువగా అల్లరి చేయడం, ఆటపాటల్లో మునిగిపోవడం అతని స్వభావం కాదని చెప్పారు. ఇంట్లోనూ, బయటా కూడా ప్రశాంతంగా ఉండేవాడని సురేఖ గుర్తుచేశారు.

45
మెగా పవర్ స్టార్ బ్యాడ్ హ్యాబిట్..
Image Credit : IMDB

మెగా పవర్ స్టార్ బ్యాడ్ హ్యాబిట్..

అయితే టీనేజ్ దశలోకి వచ్చిన తర్వాత చరణ్‌లో కొంత చలాకీతనం పెరిగిందని సురేఖ వెల్లడించారు. వయస్సు పెరుగుతున్న కొద్దీ అతని వ్యక్తిత్వంలో మార్పులు వచ్చాయని, కానీ చిన్నప్పటి నుంచి ఉన్న శాంత స్వభావం మాత్రం కొనసాగిందని వివరించారు. 

ఇక చరణ్‌కు ‘కిల్లీ’ అంటే ఎంతో ఇష్టమని సురేఖ సరదాగా గుర్తుచేసుకున్నారు. చిన్నపిల్లలు అలాంటి పదార్థాలు తినకూడదని ఇంట్లో చెప్పినా, పక్కకు వెళ్లి.. సందులో నిలబడి.. సైలెంట్‌గా కిల్లీ తినేవాడని నవ్వుతూ చెప్పారు. ఈ విషయం కుటుంబంలో ఇప్పటికీ గుర్తుచేసుకుంటూ మాట్లాడుకుంటూ.. నవ్వుకుంటామని ఆమె పేర్కొన్నారు.

55
రామ్ చరణ్ సినిమాలు
Image Credit : Asianet News

రామ్ చరణ్ సినిమాలు

ఇదిలా ఉండగా, రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. 

ఏప్రిల్ 30న ఈమూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పెద్ది సినిమా నుంచి రిలీజ్ అయిన అప్ డేట్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీతో ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలన్న ప్రయత్నంలో ఉన్నాడు చరణ్. ఇక ఈమూవీ తరువాత సుకుమార్ తో మరో సినిమా చేయబోతున్నాడు రామ్ చరణ్.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రామ్ చరణ్ కొణిదెల
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
ఈ క్యూట్ పాప 1000 కోట్ల హీరోయిన్, 15 హిట్లు కొట్టింది..పెళ్లి పీటలెక్కబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా?
Recommended image2
రామ్ చరణ్ తో త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా.. ఎలా మిస్ అయ్యిందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved