'బాహుబలి'ని మించిన 'మహానటి'!

industry facilitates mahanati
Highlights

రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది

రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. తెలుగు సినిమా స్థాయిని పెంచిన చిత్రమని ప్రతి ఒక్కరూ గర్వంగా ఈ సినిమా గురించి మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు గౌరవం విషయంలో 'బాహుబలి' సినిమాను మించిపోయింది 'మహానటి'. ఓ పక్క విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటూనే మరోపక్క భారీ వసూళ్లను సాధిస్తోందీ చిత్రం.

కేవలం మౌత్ టాక్ తోనే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తన సత్తాచాటుతోంది. రిపీటెడ్ ఆడియన్స్ సంఖ్య కూడా రోజురోజుకి పెరిగిపోతుంది. ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతుంటే ఇండస్ట్రీ కూడా ఈ సినిమా నెత్తినపెట్టుకొని మోస్తుండడం మరో విశేషం.

ఇండస్ట్రీకు చెందిన పెద్దలు ప్రత్యేకంగా ఈ సినిమాను అభినందించడంతో పాటు 'మహానటి' బృందాన్ని సన్మానించడం, ఆ సినిమాపై ప్రశంసలు కురిపిస్తుండం ఇప్పటివరకు ఏ సినిమా విషయంలో కూడా జరగలేదు. ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమాను ప్రేమిస్తుండడం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి!

loader