ఇవాంకా కు ఇంద్ర సేనుడి సాదర స్వాగతం.. ఫుల్ పబ్లిసిటి

First Published 29, Nov 2017, 10:00 PM IST
indrasena got publicity with ivanka welcoming poster
Highlights
  • విజయ్ ఆంటోని హీరోగా ఇంద్ర సేన
  • ఈనెల 30న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఇంద్రసేన
  • జీఈఎస్ 2017 సందర్భంగా ఇవాంకాకు ఇంద్రసేన టీమ్ స్వాగత పోస్టర్లు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లో జరిగే ‘గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్‌-2017’కు వచ్చిన సందర్భంగా నగరమంతా సర్వాంగ సుందరంగా తయారైంది. ఎక్కడ చూసినా ఇవాంకాకు గ్రాండ్ వెల్కం చెబుతూ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు నగరమంతా దర్శనం ఇస్తున్నాయి. అయితే ఇవాంకా రాకను మూవీ ప్రమోషన్స్‌ కోసం వాడేస్తున్నాడు ‘ఇంద్రసేన’ చిత్ర యూనిట్. ఇంతకీ ఇవాంకాకు మూవీతో ఏం కనెక్షన్ వుందో గానీ భారీ పోస్టర్లతో ఇవాంకాకు ఇంద్ర సేన స్వాగతం పలుకడం వెరైటీగా, చర్చనీయాంశంగా మారింది.విజయ్ ఆంటోని నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఇంద్రసేన’ నవంబర్ 30న విడుదలకు రెడీ అయ్యింది. ప్రస్తుతం ప్రమోషన్స్ వర్క్స్‌తో బిజీగా ఉన్న చిత్రయూనిట్ తమ సినిమా ప్రచారానికి ఇవాంకాను విరివిగా వాడేసుకుంది. ఇవాంకాకు స్వాగతం పలుకుతూ.. ‘వెల్కం టు హైదరాబాద్.. ఇవాంకా ట్రంప్’ అంటూ ఒక పక్క విజయ్ ఆంటోని ఫోటోని మరోవైపు అందాల ఇవాంకా ఫోటోతో ప్లెక్సీలు తయారుచేసి నగర మంతా అతికించేశారు. దీంతో ‘ఇంద్రసేన’ పబ్లిసిటీ సరికొత్తగా ఉందంటూ ఆఖరుకి ట్రంప్ కూతుర్ని కూడా మూవీ ప్రమోషన్స్‌కి వాడేశాడంటూ విజయ్ ఆంటోని మూవీకి ఊహించిన దానికంటే ఎక్కవ పబ్లిసిటీ వచ్చేసింది.

loader