Illu Illalu Pillalu Today Episode Jan 17: ఇల్లు పిల్లలు పిల్లలు నేటి ఎపిసోడ్ లో అమూల్య నిశ్చితార్థం ఆపేందుకు శ్రీవల్లి, భాగ్యం చాలా ప్లాన్ చేస్తారు. కానీ అనుకోకుండా వర్కవుట్ అవ్వదు. ఈ నిశ్చితార్థం ఎపిసోడ్ నే నాలుగు రోజులుగా సాగదీస్తూనే ఉన్నారు.  

ఇల్లు పిల్లలు పిల్లలు నేటి ఎపిసోడ్ లో రామరాజు తన కుటుంబంలోని వారందరినీ వచ్చిన పెళ్లి వారికి పరిచయం చేస్తాడు. వేదవతి మాత్రం అక్కడ ఉండదు. దీంతో నర్మద వెళ్లి వేదవతిని తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది. నర్మద వేదవతి దగ్గరికి వెళ్తుంది. వేదవతి తన పుట్టింటిని చూస్తూ తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అది చూసి నర్మద ఒక వైపు కూతురి పెళ్లి అంటే మీరు సంతోషంగా ఉండాలి కానీ ఎందుకిలా భయపడుతున్నారు అని అడుగుతుంది. తనకి వేదవతి నా కూతురు పెళ్లి ఆగిపోతుందేమో అని భయంగా ఉంది అని అంటుంది. ఈ లోపు ప్రేమ అక్కడ లేకపోవడంతో ధీరజ్ తో ప్రేమను తీసుకురమ్మని చెబుతాడు రామరాజు. దీంతో ధీరజ్ ప్రేమ దగ్గరికి వెళ్లి రమ్మని అడుగుతాడు. దానికి ప్రేమ రానని చెబుతుంది. వీరిద్దరి గిల్లికజ్జాల మధ్య పొట్టి పిల్ల సాంగ్ బ్యాక్ గ్రౌండ్లో వస్తుంది. ధీరజ్ చాలా బతిమిలాడడంతో ప్రేమ నిశ్చితార్థానికి వెళ్లేందుకు ఒప్పుకుంటుంది. వాళ్ళిద్దరూ ఇలా నడిచి వెళుతుంటే ప్రేమ కాలుజారి కింద పడుతుంది. ప్రేమ చేతిలో ఉన్న పువ్వులన్నీ కింద పడిపోతాయి. వెంటనే ధీరజ్ ఆ పువ్వులన్నీ రిప్లై పెట్టి ప్రేమకు ఇచ్చి తీసుకొస్తాడు. అది చూసి పెళ్లి కొడుకు తల్లి నీరజ.. మీ చిన్న కోడలు అంటే మీ కొడుకుకి ఎంతో ప్రేమనుకుంటాను అని అంటుంది. దానికి రామరాజు అవునండి వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు అని అంటాడు.

పెళ్లికొడుకు దుస్తుల్లో ఫోటోలు

ఇక పెళ్ళికొడుకుకు కొత్త బట్టలు పెట్టేందుకు సిద్ధమవుతారు. ఆ సమయంలోనే భాగ్యం, శ్రీ వల్లిని పక్కకు తీసుకువెళుతుంది. పెళ్లికొడుకుకు పెట్టే బట్టల్లో మనం విశ్వా, అమూల్య కలిసి ఉన్న ఫోటోలు పెడితే ఈ పెళ్లి ఆగిపోతుంది అని ప్లాన్ వేస్తారు. ఇక ఇద్దరు పెళ్లి కొడుకుకి ఇవ్వాల్సిన బట్టలు ఎక్కడున్నాయో వెతుకుతారు. కానీ శ్రీవల్లి మాత్రం మరోపక్క టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఈ ఫోటోలు పెట్టింది నేనే అని తెలిస్తే నా బతుకు ఏమవుతుందో అని భయపడుతూ ఉంటుంది. పెళ్ళికొడుకు దుస్తుల్లో ఫోటోలు పెట్టేందుకు ప్రయత్నిస్తుంది శ్రీవల్లి. కానీ అదే సమయంలో నర్మద అక్కడికి వచ్చేస్తుంది. దీంతో ఫోటోలు పెట్టకముందే నర్మద ఆ దుస్తులను తీసుకుంటుంది. కానీ భాగ్యాన్ని అక్కడ చూసి నర్మదకు అనుమానం వస్తుంది. మంచం కింద శ్రీవల్లి దాక్కొని ఉంటుంది.

అక్కడ నిశ్చితార్థం జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు అని నర్మద భాగ్యాన్ని అడుగుతుంది. కానీ భాగ్యం మాత్రం నాకు జలుబు చేసింది, తుమ్ములు వస్తాయి, అక్కడ ఉంటే బాగోదు కదా అని చెప్పేస్తుంది. శ్రీవల్లి మాత్రం నర్మద తనను చూడలేదనుకుని తప్పించుకున్నానని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక బయటికి వచ్చిన శ్రీవల్లి భాగ్యంతో మాట్లాడుతూ ఎలాగైనా సరే ఈ పెళ్లిని పెటాకులు చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు.

మరొపక్క శ్రీ వల్లి మాత్రం ఈ విషయం బయటపడితే మాత్రం నన్ను చంపేస్తారు. నా జీవితం ఏమవుతుందో అని టెన్షన్ పడుతుంది. ఇక మరో పక్క భాగ్యం ఎలాగైనా సరే అమూల్య, విశ్వలు కలిసి ఉన్న ఫోటోలను పెళ్లి వారి కంటపడేలా చేయాలని నిర్ణయించుకుంటుంది. పెళ్లి ఆగిపోయేలా చేస్తానని చెబుతుంది. దాంతో ఎపిసోడ్ ముగిసిపోతుంది. ఇక రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో కూడా ప్రోమోలో చూపించారు. ఆ ప్రోమోలో భాగ్యం శ్రీవల్లి తీరుపై ప్రేమ నర్మదలకు అనుమానం వస్తుంది. వారు రేపు ఏం చేయబోతున్నారో చూడాలి.