15 ఏళ్లుగా బాధపడుతున్నా : ఇలియానా

Illeana reveals her health condition
Highlights

15 ఏళ్లుగా (బీడీడీ) తో బాధపడుతున్నా

15 ఏళ్లుగా ‘బాడీ డిస్‌మార్ఫిక్ డిజార్డర్ (బీడీడీ)’తో బాధపడుతున్నానని చెప్పింది హీరోయిన్ ఇలియానా. తన అనారోగ్య పరిస్థితి గురించి చెప్పేందుకు తనకు అభ్యంతరం లేదంది. కానీ, తనను అలాంటి ఓ అనారోగ్య స్థితిలో జనాలు చూస్తే అదే ఎక్కువగా బాధిస్తుందని తెలిపింది. ఏదైనా ఓ విషయం గురించి మనం సిగ్గుపడితే దాన్ని బయటకు చెప్పడం చాలా కష్టమవుతుందని  అభిప్రాయపడింది.

మరోవైపు తన వ్యక్తిగత జీవితం చాలా పవిత్రమైందని.. అందులో చాలా కోణాలు ఉన్నాయని వెల్లడించింది. వాటి గురించి మాట్లాడితే అందులో వక్రీకరించబడిన విషయాల గురించి మాత్రమే జనాలు మాట్లాడుకుని మిగిలిన మంచి విషయాలను వదిలేస్తారని వాపోయింది. మీడియాలో తన పర్సనల్ లైఫ్ గాసిప్‌లపాలు కావడం తనకు అస్సలు ఇష్టం ఉండదని తెలిపింది ఇలియానా.

loader