ఇలియానా, అజయ్ దేవ్ గన్ కలసి నటించిన రైడ్ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఇలియానా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా గడుపుతోంది. ఇటీవల సౌత్ చిత్ర సీమపై కామెంట్లు చేసిన ఇలియానా ఇప్పుడు బాలీవుడ్ పై పడింది. బాలీవుడ్ లో కూడా చెడు మనస్తత్వం కలిగిన హీరోలు చాలా మంది ఉన్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

 కాస్టింగ్ కౌచ్ పేరుతో వేధించే హీరోలు నాతోపాటు చాలా మంది హీరోయిన్లకు తెలుసు. కానీ ధైర్యం సరిపోక ఎవరూ పేర్లు బయట పెట్టడానికి ముందుకు రావడం లేదని ఇలియానా తెలిపింది. పేర్లు బయటపెట్టాలని ప్రయత్నించినా, స్టార్ హీరోల గురించి బాలీవుడ్ లో వ్యతిరేకంగా మాట్లాడినా ఆ హీరోయిన్ల కెరీర్ అంతటితో ముగిసిపోతుందని ఇలియానా తెలిపింది. రైడ్ చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఇలియానా ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. గత ఏడాది హాట్ బ్యూటీ రిచా చద్దా కాస్టింగ్ కౌచ్ గురించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. హీరోయిన్లని వేధించే వారి వీరి పేర్లు నాకు తెలుసు అని కానీ తన కెరీర్ కు ఎటువంటి డోకా లేదని హామీ ఇవ్వగలిగితే వారి పేర్లు బయటపెడతా అని మాట్లాడి సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఇదే తరహాలో ఇలియానా కూడా వ్యాఖ్యలు చేయడం విశేషం. హాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత హార్వీ వైన్ స్టైన్ చీకటి కోణాన్ని హీరోయిన్లంతా కలసి బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే.