ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది గోవా బ్యూటీ ఇలియానా. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ భామకి బాలీవుడ్ లో ఛాన్స్ రావడంతో  తన మకాం షిఫ్ట్ చేసింది. కొన్నాళ్ల పాటు ఆండ్రూ నీబోన్ అనే విదేశీ ఫోటోగ్రాఫర్ తో డేటింగ్ చేసింది.

రీసెంట్ గా ఇద్దరికీ బ్రేకప్ అవ్వడంతో మరోసారి తన కెరీర్ పై దృష్టి పెట్టింది. చాలా కాలం తరువాత టాలీవుడ్ లో ఆమె నటించిన 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమా ఫ్లాప్ అయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో 'పాగల్ పంటీ', 'ది బిగ్ బుల్' అనే చిత్రాల్లో నటిస్తోంది. బాలీవుడ్ సినిమాలతో ఓ రకంగా ఇలియానా బాగానే సంపాదించింది. 

డిప్రెషన్ లో ఇలియానా.. సైకియాట్రిస్ట్ సహాయంతో..!

అయితే ఆమెకి ఇంకా చాలా డబ్బులు కావాలట. ఈ విషయాన్ని ఇలియానా స్వయంగా వెల్లడించింది. గోవాలోని సముద్రానికి ఎదురుగా ఇల్లు కట్టుకోవాలనేది ఇలియానా కోరికట. దాని కోసం చాలా డబ్బులు కావాలని అంటోంది. ఆ డబ్బులు వీలైనంత త్వరగా సంపాదించాలని చెబుతోంది ఈ గోవా బ్యూటీ.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇలియానా తన డ్రీమ్ గురించి చెప్పింది. ''గోవాలో ప్రస్తుతం నేను ఉంటున్న ఇల్లు సముద్రానికి దగ్గర్లోనే ఉంటుంది. కానీ, సముద్రానికి అభిముఖంగాఇల్లు కట్టుకోవాలనేది నా కల'' అంటూ చెప్పుకొచ్చింది. వచ్చే ఏడాదైనా తన కల నెరవేరాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. తన కలను నిజం చేసుకోవడానికి చాలా సంపాదించాల్సి ఉందని.. ఏదొక రోజు తన కల తప్పకుండా నెరవేరుతుందని ఇలియానా వెల్లడించింది. 

గతంలో ఈ బ్యూటీ శృంగారంపై కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. శృంగారం అనేది అద్భుతమైన అనుభవమని.. అది కేవలం ఆడ, మగ కలయిక మాత్రమే కాదు. శృంగారం అనేది పూర్తిగా మానసికమని చెప్పింది. ఇద్దరి మధ్య ప్రేమ లేకపోతే శృంగారం అనేది యాంత్రికంగా మారుతుందని.. అలాంటి  శృంగారానికి అర్ధమే లేదని చెప్పింది.