పోకిరి చిత్రం తర్వాత ఇలియానా అత్యధిక రెమ్యునరేషన్ అందుకే హీరోయిన్ గా టాలీవుడ్ లో రికార్డ్ సృష్టించింది. ఇలియానా గ్లామర్ తెలుగు యువతని ఒక ఊపు ఊపింది. ఆమె అడిగినంత పారితోషికం ఇచ్చి తమ చిత్రాల్లో నటింపజేసేందుకు అప్పట్లో దర్శక నిర్మాతలు పోటీ పడ్డారు. టాలీవుడ్ లో ఇలియానా మహేష్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి స్టార్స్ అందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. 

కెరీర్ ఫుల్ జోష్ లో ఉండగానే టాలీవుడ్ చిత్రాలకు గుడ్ బై చెప్పి బాలీవుడ్ లో మోజులో పడింది. బాలీవుడ్ కు వెళ్లాలనుకోవడం తప్పు కాదు. కానీ తెలుగు సినిమాలని వదిలేసి అక్కడకు వెళ్లడం ఇలియానా చేసిన బిగ్ మిస్టేక్ అని సినీ ప్రముఖులు ఇప్పటికి చెబుతూనే ఉంటారు. 

ప్రస్తుతం ఇలియానాకు బాలీవుడ్ లో అంతగా ఆఫర్స్ లేవు. అప్పుడప్పుడూ ఓ చిత్రంలో మెరుస్తోందంతే. ప్రస్తుతం ఇలియానా పాగల్ పంతి అనే చిత్రంలో నటించింది. నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇలియానా ప్రచార కార్యక్రమాలతో బిజీగా గడుపుతోంది. 

ఓ ఇంటర్వ్యూలో దక్షణాది చిత్రాల గురించి మాట్లాడుతూ.. అక్కడ కూడా తనకు అవకాశాలు వస్తున్నాయని తెలిపింది. గత ఏడాది టాలీవుడ్ లో రెండు పెద్ద చిత్రాలని రిజెక్ట్ చేసినట్లు ఇలియానా చెప్పుకొచ్చింది. అందుకు గల కారణాన్ని మాత్రం చెప్పలేదు. 

గత ఏడాది ఇలియానా టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చిన చిత్రం అమర్ అక్బర్ ఆంటోని. ఆ చిత్రంలో ఇలియానా బాగా బరువు పెరిగి కనిపించింది. ఆ చిత్రం కూడా నిరాశపరిచింది. దీనితో ఇలియానాకు టాలీవుడ్ లో దారులన్నీ మూసుకుపోయినట్లు ఐంది. 

ఇటీవల ఇలియానా బరువు తగ్గి మునుపటిలా నాజూగ్గా మారింది.  టాలీవుడ్ లో అవకాశాలు వస్తే వదులుకోకూడదని ఇలియానా భావిస్తోందట. అందుకే తనకు పరిచయం ఉన్న బడా దర్శకులతో సంప్రదింపులు జరుపుతోందని వినికిడి. మరి ఇలియానాని కరుణించే దర్శకుడు ఎవరో..