బాయ్ ఫ్రెండ్ గురించి హీరోయిన్ చెప్పిన మాట!

ileana about her boy friend andrew nibon
Highlights

'మీరు ఆండ్రూని ప్రేమిస్తున్నారా..?' అని అడగగా.. 'పిచ్చి పిచ్చి గా ప్రేమిస్తున్నా..' అని చెప్పింది. ఓ విదేశీయుడిని ఎందుకు ఎన్నుకున్నావనే ప్రశ్నకు సమాధానంగా 'ఓ వ్యక్తి మనసుతో నా మనసు ప్రేమలో పడింది. అతడి రంగు, ఏ దేశం వంటి విషయాలు నాకు అనవసరం' అంటూ చెప్పుకొచ్చింది

ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ నీబోన్ తో ప్రముఖ హీరోయిన్ ఇలియానా డేటింగ్ చేస్తోందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ కలిసి తీసుకునే ఫోటోలను తరచూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులతో షేర్ చేసుకుంటుంటుంది. గతంలో ఓ పోస్ట్ లో హబ్బీ అంటూ పోస్ట్ చేసిన ఇలియానా , రీసెంట్ గా మై లవ్ అంటూ మరో ఫోటో పోస్ట్ చేసింది.

అయితే రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ అభిమాని ఇలియానాను తన ప్రేమ, పెళ్లి విషయాలకు సంబంధించి కొన్ని ప్రశ్నలు అడిగాడు. 'మీరు ఆండ్రూని ప్రేమిస్తున్నారా..?' అని అడగగా.. 'పిచ్చి పిచ్చి గా ప్రేమిస్తున్నా..' అని చెప్పింది. ఓ విదేశీయుడిని ఎందుకు ఎన్నుకున్నావనే ప్రశ్నకు సమాధానంగా 'ఓ వ్యక్తి మనసుతో నా మనసు ప్రేమలో పడింది. అతడి రంగు, ఏ దేశం వంటి విషయాలు నాకు అనవసరం' అంటూ చెప్పుకొచ్చింది.

ఇలియానా చెప్పిన తీరుని అభిమానులు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఇలియానా తెలుగులో రవితేజ సరసన 'అమర్ అక్బర్ ఆంటోనీ' అనే సినిమాలో నటిస్తోంది. దాదాపు ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఆమె తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. తెలుగులో రీఎంట్రీ ఇవ్వడం కాస్త నెర్వస్ గా ఉందని చెప్పారు. 

loader