పొట్టి దుస్తులు వేసుకుంటే తప్పేంటి?

I don’t know what’s motherly dressing says kareena kapoor
Highlights

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కు బిడ్డ పుట్టిన తరువాత మళ్లీ సినిమాలలో బిజీ అయింది

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కు బిడ్డ పుట్టిన తరువాత మళ్లీ సినిమాలలో బిజీ అయింది. రీసెంట్ గా ఆమె నటించిన 'వీరే ది వెడ్డింగ్' సినిమా విడుదలైంది. ఈ సినిమాలో ఆమె బట్టలు అసభ్యకరంగా ఉన్నాయని.. ఓ తల్లికి బిడ్డ ఇలాంటి బట్టలు ఎలా ధరిస్తుంది అంటూ ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన కరీనా..

''నాకు ఎలాంటి దుస్తులు సూట్ అవుతాయో.. అవే వేసుకుంటాను. ఓ తల్లి ఇలాంటి బట్టలే వేసుకోవాలని చెప్పడం ఏంటో నాకు అర్ధం కావడం లేదు. మా అమ్మ ఇప్పటికీ మోడర్న్ బట్టలు వేసుకుంటుంది. ఆమె జీన్స్ వేసుకుంటే మరింత అందంగా కనిపిస్తుంది. మా అత్త గారు కూడా జీన్స్ వేసుకుంటారు. ఆమె చీరలో ఎంత అందంగా ఉంటుందో జీన్స్ లో కూడా అంతే అందంగా కనిపిస్తారు. మీకు ఎలాంటి బట్టలు నచ్చుతాయో అవే వేసుకోండి.. నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా నాపై ఇలాంటి విమర్శలు చాలా చేశారు. మహిళలు వాళ్లకి నచ్చిన విధంగా ఉండే స్వేచ్చనివ్వాలి'' అంటూ స్పందించింది. 

loader