టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు తారక్.. ఆయనను వెండితెరపై చూసుకొని మురిసిపోయే అభిమానులు ఎందరో.. నిత్యం కెమెరా ముందు ఉంటూ నటించే యంగ్ టైగర్ కు కెమెరా ముందు ఫోటోలకు ఫోజలుఇవ్వాలంటే వణుకు అంట. వినడానికి వింతగా అనిపిస్తుంది కదా కానీ అది నిజమని ఆయనే అంటున్నాడు. హీరోలందరూ షూటింగ్ లతో పాటు రకరకాల ఫోటో షూట్లలో పాల్గొంటుంటారు.

కెమెరా ముందు నటించే వారికి ఫోటోలకు ఫోజులివ్వడం ఎంతసేపు చెప్పండి. కానీ తనకు మాత్రం ఫోటోలకు ఫోజులు ఇవ్వాలంటే మాత్రం వణుకు వచ్చేస్తుంటుందని తారక్ వెల్లడించడం విశేషం. రీసెంట్ గా సెలెక్ట్ మొబైల్స్ బ్రాండ్ అంబాసిడర్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంపికైన సంగతి తెలిసిందే. శుక్రవారం జరిగిన ఈ ఈవెంట్ లో పాల్గొన్న ఎన్టీఆర్.. తను ఇంటర్ చదివే రోజుల్లో జగదీశ్ మార్కెట్ లో సెకండ్ హ్యాండ్ అల్కాటెల్ ఫోన్ కొన్నానని.. అదే తన మొదటి ఫోన్ అని తెలిపారు.

ఇక ఫోన్ ఎక్కువగా వాడతారా..? ఫోటోలు బాగా దిగుతారా..? అనే ప్రశ్నలకు సమాధానంగా ఆయన 'ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఏం ఉన్నా లేకపోయినా.. ఫోన్ తీసి చూస్తున్నారు. నేను కూడా అందరిలానే.. కానీ నేను ఫోటోలు మాత్రం దిగను. నాకు ఫోజులు ఇవ్వడం నచ్చదు. అందంటే నాకు వణుకు వచ్చేస్తుంది. నా భార్య కూడానాకు ఫోటోలు తీస్తా అంటుంది. కానీ నాకు మాత్రం ఫోజులివ్వడం రాదు'' అని వెల్లడించారు.