తెలియక చేశాను.. నన్ను క్షమించండి: నటి రిక్వెస్ట్

I didn't know Kiki Challenge was banned when I did it says niveditha
Highlights

సోషల్ మీడియాలో ఈ ఛాలెంజ్ చూసి సరదాగా ప్రయత్నించానే కానీ దాన్ని నిషేధించారనే విషయం నాకు తెలియదు. విషయం తెలిసిన తరువాత వేరే వాళ్లు ప్రయత్నించకూడదని ఆ వీడియో తొలగించాను

హాలీవుడ్ నుండి దక్షిణాదికి పాకిన 'కీకీ ఛాలెంజ్' ను చాలా మంది తారలు యాక్సెప్ట్ చేసి వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. కదులుతున్న కారులో నుండి కిందకి దిగి కారు మెల్లగా వెళ్తుంటే దానితో పాటు రోడ్ మీద డాన్స్ చేసుకుంటూ వెళ్లి మళ్లీ కార్ లోకి వచ్చేయాలి. ఈ ఛాలెంజ్ ను స్వీకరించిన తారలు ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇలా చేయడం వలన తమకు మాత్రమే కాకుండా పక్కవారికి కూడా హానీ జరిగే అవకాశాలు ఉన్నాయని భావించిన పోలీసులు ఈ ఛాలెంజ్ ను బ్యాన్ చేశారు.

ఈ విషయం తెలియని శాండల్ వుడ్ నటి నివేదిత గౌడ ఈ ఛాలెంజ్ ను స్వీకరించి వీడియో అప్లోడ్ చేశారు. దీంతో నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డారు. విషయం తెలుసుకున్న నివేదిత తాను తెలియక ఈ పని చేశానని చెప్పుకొచ్చింది. 'సోషల్ మీడియాలో ఈ ఛాలెంజ్ చూసి సరదాగా ప్రయత్నించానే కానీ దాన్ని నిషేధించారనే విషయం నాకు తెలియదు. విషయం తెలిసిన తరువాత వేరే వాళ్లు ప్రయత్నించకూడదని ఆ వీడియో తొలగించాను.

ప్రాణాల మీదకు తెచ్చుకోవాలని ప్రజలకు చెప్పేంత మూర్ఖురాలిని కాదు కదా.. నన్ను క్షమించండి' అంటూ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. కన్నడ బిగ్ బాస్ సీజన్ 5 ద్వారా పాపులర్ అయిన నివేదిత ఇప్పుడు మరోసారి ఈ ఛాలెంజ్ కారణంగా వార్తల్లో నిలిచింది.  

loader