అగ్రహీరో: నా దగ్గర వెయ్యి కోట్లు ఉన్నాయ్.. నాకు నచ్చినట్లు ఉంటా

I can openly say that I have 1000 crores for myself says hero simbu
Highlights

తమిళ అగ్ర కథానాయకుడిగా పేరు తెచ్చుకున్న నటుడు శింబు.. లేటెస్ట్ గా తను చేయబోయే 

తమిళ అగ్ర కథానాయకుడిగా పేరు తెచ్చుకున్న నటుడు శింబు.. లేటెస్ట్ గా తను చేయబోయే మూడు సినిమాలను ఒకేసారి ప్రకటించారు. దీంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆయనపై విరుచుకుపడ్డారు. 'ఒకేసారి సినిమాలు చేయడం కాదు టైమ్ కి షూటింగ్ కు వెళ్లడం నేర్చుకో' అంటూ కామెంట్లు పెట్టారు. వీటిపై నేరుగా స్పందించకపోయినా.. పరోక్షంగా మీడియాకు ఓ ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశాడు.

'నేను నా మొదటి సినిమా చేసినప్పుడు కూడా మా నాన్నతో కలిసి 10 గంటలకు సెట్ కు వెళ్లాను. దర్శకనిర్మాతలకు గౌరవం లేక ఇలా చేయలేదు.. నేనెప్పుడు కూడా నాకు నచ్చినట్లు ఉంటాను. చిన్నప్పటినుండి గారాబంగా పెరిగాను. స్వేచ్చగా ఉండడం నాకు అలవాటు. రోబోలా నేను పని చేయలేను. నా తల్లితండ్రుల ఆస్తులు కాకుండా నేను సొంతంగా సంపాదించుకున్నాను. నా దగ్గర వెయ్యి కోట్ల ఆస్తి ఉంది. కాబట్టి నేను సంతోషంగా బ్రతకగలను. ప్రజలకు ఆ విషయం అర్ధం కావట్లేదు.. కానీ సినిమాలంటే నాకు ఇష్టం. కానీ నా కారణంగా పక్కవాళ్లు ఇబ్బందిపడాలనే స్వార్ధబుద్ధి నాకు లేదు. అందుకే నా పనుల కారణంగా ఎవరికైనా ఇబ్బంది కలిగితే నా ప్రవర్తన మార్చుకుంటా.. ప్రస్తుతం అదే పనిలో ఉన్నాను' అంటూ వెల్లడించారు.   

 

loader