మీరు ఏమైనా అనుకోండి.. నేనైతే స్టిల్ వర్జిన్: విజయ్ దేవరకొండ

i am still virgin says vijay devarakonda
Highlights

'పెళ్లిచూపులు','అర్జున్ రెడ్డి' వంటి చిత్రాలతో పాపులారిటీ దక్కించుకున్న నటుడు విజయ్ దేవరకొండ

'పెళ్లిచూపులు','అర్జున్ రెడ్డి' వంటి చిత్రాలతో పాపులారిటీ దక్కించుకున్న నటుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం తనకున్న కమిట్మెంట్స్ తో బిజీగా గడుపుతున్నాడు. గీతగోవిందం, నోటా, టాక్సివాలా సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

అయితే దర్శకుడు పరశురాం డైరెక్ట్ చేస్తోన్న 'గీత గోవిందం' సినిమాకు వినూత్న ప్రచారాన్ని మొదలుపెట్టాడు విజయ్ దేవరకొండ. సినిమా పోస్టర్లతో ట్విట్టర్ లో హడావిడి చేస్తున్నాడు. అలానే హీరోయిన్ రష్మికతో సోషల్ మీడియాలో ఫాన్నీ కాన్వర్జేషన్లు నడిపిస్తున్నాడు. ఈ సంభాషణలు ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ మరో పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం.

ఆ పోస్టర్ తో పాటు విజయ్ ఓ కామెంట్ కూడా పెట్టాడు. 'మీరు ఏమైనా అనుకోండి. నా అఫీషియల్ స్టేటస్ మాత్రం ఇదే మేడమ్' అంటూ పోస్టర్ పెట్టాడు. పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ లో ఐ యామ్ 25.. స్టిల్ వర్జిన్ మేడమ్.. అంటూ విజయ్ హీరోయిన్ ను ఓరగా చూస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో జిఏ2 బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఆగస్ట్ 15న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. 

 

loader