పవన్ పార్టీలో హైపర్ ఆది తన పంచ్ పవర్ చూపిస్తాడా?

hyper aadi to join janasena party
Highlights

జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన హైపర్ ఆది కూడా పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. ఆయనపై విమర్శలు చేస్తున్నాడని కత్తి మహేష్ పై గతంలో విరుచుకుపడ్డాడు ఆది. కత్తి మహేష్ ను ఉద్దేశిస్తూ జబర్దస్త్ లో ఓ స్కిట్ కూడా చేశాడు. అయితే ఇప్పుడు పవన్ ఛాన్స్ ఇస్తే జనసేన తరఫున ప్రచారం చేయడానికి సిద్ధం అంటున్నాడు ఆది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'జనసేన' పార్టీ తరఫున ఆంధ్రాలో ప్రజా పోరాట యాత్ర చేస్తున్నాడు. ఈ యాత్రలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరుని ప్రశ్నిస్తూ సంచలనాలకు దారి తీస్తున్నాడు. అయితే మరోపక్క పవన్ పర్మిషన్ ఇస్తే ఆయన పార్టీలో చేరి రాజకీయ సేవ చేయాలని చాలా మంది ఆర్టిస్టులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో ఆయనకు సపోర్టర్స్ లిస్టు రోజురోజుకి పెరిగిపోతుంది. 

జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన హైపర్ ఆది కూడా పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. ఆయనపై విమర్శలు చేస్తున్నాడని కత్తి మహేష్ పై గతంలో విరుచుకుపడ్డాడు ఆది. కత్తి మహేష్ ను ఉద్దేశిస్తూ జబర్దస్త్ లో ఓ స్కిట్ కూడా చేశాడు. ఈ విషయంపై పెద్ద వివాదమే జరిగింది. అయితే ఇప్పుడు పవన్ ఛాన్స్ ఇస్తే జనసేన తరఫున ప్రచారం చేయడానికి సిద్ధం అంటున్నాడు ఆది. ఆ విషయాన్ని పవన్ ను కూడా కలిసి చెప్పాడట. 

పార్టీలో చేరేప్పుడు అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించుకొని అప్పుడు చేరాలని సూచించాడట పవన్. దానికి సిద్ధమైతే నిజాయితీగా పార్టీలో జాయిన్ అవ్వమని ఆహ్వానించాడని అంటున్నారు. ఒకవేళ ఆది గనుక జనసేనలో జాయిన్ అయితే ఆ పార్టీ ప్రత్యర్ధులపై తనదైన పంచ్ డైలాగ్స్ తో విరుచుకుపడడం ఖాయమని అంటున్నారు. ఇప్పటినుంది పార్టీ కోసం కొన్ని కొటేషన్లు కూడా సిద్ధం చేస్తున్నాడట. మరి జబర్దస్త్ షోలో వేసిన పంచ్ ల అనుభవం రాజకీయాల్లో ఎంతవరకు పని చేస్తుందో చూడాలి!
 

loader