హైదరాబాద్ సినిమాకి హబ్ గా మారబోతుంది. ఇప్పటికే ప్రసాద్స్, పీవీఆర్ తో అద్భుతమైన సినిమా ఎక్స్ పీరియెన్స్ ని ఇస్తుంది. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద డాల్బీ సినిమా ప్రారంభం కాబోతుంది.
హైదరాబాద్‌లో అతిపెద్ద డాల్బీ సినిమా
మన హైదరాబాద్‌లో అతిపెద్ద స్క్రీన్‌గా ప్రసాద్స్ లోని బిగ్ స్క్రీన్ ఉంది. ఐమాక్స్ ఫార్మాట్‌లో ఉన్న ఇది అతిపెద్ద స్క్రీన్‌గా పేరుతెచ్చుకుంది. అయితే ఇప్పుడు దీన్ని తలదన్నే డాల్బీ స్క్రీన్ వస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్ రాబోతుంది. అందుకు హైదరాబాద్ వేదిక కావడం విశేషం. ఇండియాలోని ఆరు కేంద్రాలలో ఈ బిగ్గెస్ట్ డాల్బీ సినిమాని ఇన్‌స్టాల్ చేస్తున్నారు.
కోకాపేటలోని అల్లు సినీప్లెక్స్ ల ప్రపంచంలోని అతిపెద్ద డాల్బీ సినిమా
ఇండియాలో తొలి డాల్బీ సినిమాని మన హైదరాబాద్‌లో లాంచ్ చేస్తున్నారు. దీనికి అల్లు సినీ ప్లెక్స్ వేదికగా నిలుస్తుంది. కోకాపేటాలోని అల్లు సినీ ప్లెక్స్ లో ఈ బిగ్గెస్ట్ డాల్బీ సినిమాని ప్రారంభిస్తున్నారు. డాల్బీ లాబొరేటరీస్ దేశంలో ఆరు డాల్బీ సినిమా ఇన్‌స్టాలేషన్‌లను ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. వాటిలో ముఖ్యమైనదిగా ఈ కోకాపేటలోని అల్లు సినీప్లెక్స్ లో ప్రారంభించబోతుండటం విశేషం.
ఐమాక్స్ బిగ్ స్క్రీన్‌ని మించిన డాల్బీ సినిమా స్క్రీన్
ఈ డాల్బీ స్క్రీన్ కోసం అల్లు సినీ ప్లెక్స్ లో 75 అడుగుల వెడల్పు గల స్క్రీన్‌ని ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వెడల్పైన స్క్రీన్‌గా ఉండబోతుంది.ప్రసాద్ ఐమాక్స్ లోని బిగ్ స్క్రీన్‌ని మించి ఉండబోతుంది. డాల్బీ విజన్, డాల్బీ 3డీతో కూడిన డీసీఐ ఫ్లాట్ 1.85 యూస్పెక్ట్ రేషియో, స్టూడియో గ్రేడ్ డాల్బీ అట్మాస్ ఊహకందని విధంగా ఉండబోతుందట. ఇలా అల్లు అర్జున్‌కి చెందిన సినీ ప్లెక్స్ లో ఇది ప్రారంభించడం విశేషం. అల్లు అర్జున్ థియేటర్ రంగంలో రాణిస్తున్నారు. ఇప్పటికే `ఏఏఏ` పేరుతో సినిమా మల్టీప్లెక్స్ ని ప్రారంభించారు. అమీర్ పేట్‌తో నడుస్తోంది. నెమ్మదిగా ఇతర ప్రాంతాల్లోనూ దీన్ని విస్తరిస్తున్నారు.
సైన్స్ ఫిక్షన్ మూవీతో రాబోతున్న అల్లు అర్జున్
ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ .. అట్లీ దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో సినిమా చేస్తున్నారు. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ మేళవింపుతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. సూపర్ హీరో కాన్సెప్ట్ తో ఈ మూవీని రూపొందిస్తుండటం విశేషం. దాదాపు వెయ్యి కోట్లతో ఈ మూవీని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.


