- Home
- Entertainment
- వెంకటేష్ బ్లాక్ బస్టర్ `మల్లీశ్వరి`ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమె నో చెప్పినా వదల్లేదు
వెంకటేష్ బ్లాక్ బస్టర్ `మల్లీశ్వరి`ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమె నో చెప్పినా వదల్లేదు
వెంకటేష్, కత్రినా కైఫ్ జంటగా నటించిన `మల్లీశ్వరి` సినిమా పెద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అయితే ఈ మూవీని ఓ స్టార్ హీరోయిన్ మిస్ చేసుకుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.

మల్లీశ్వరితో బ్లాక్ బస్టర్ కొట్టిన వెంకటేష్
విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో పెద్ద హిట్ చిత్రాల్లో `మల్లీశ్వరి` ఒకటి. 2004లో విడుదలైన ఈ చిత్రానికి కె విజయభాస్కర్ దర్శకుడు. ఈ మూవీకి త్రివిక్రమ్ డైలాగ్‌లు రాశారు. స్క్రిప్ట్ అందించింది కూడా ఆయనే. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది. `నువ్వు నాకు నచ్చావ్` తర్వాత రెండేళ్ల వరకు వెంకటేష్‌కి హిట్లు లేవు. `వాసు`,` జెమినీ`, `వసంతం` చిత్రాలు బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్ చేశాయి. దీంతో మరోసారి విజయ్ భాస్కర్‌తో కలిసి `మల్లీశ్వరి` చిత్రానికి వర్క్ చేశారు. దీనితో బ్లాక్ బస్టర్ అందుకొని బౌన్స్ బ్యాక్ అయ్యారు వెంకీ.
`మల్లీశ్వరి`కి నో చెప్పిన కత్రినా కైఫ్
ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ భామ కత్రీనా కైఫ్ నటించింది. తెలుగులో ఆమె నటించిన తొలి చిత్రమిది. ఓ యాడ్‌లో చూసిన దర్శకుడు కె విజయభాస్కర్ కత్రినా కైఫ్ అయితే బాగుంటుందని భావించారు. తన సినిమాలో హీరోయిన్ యువరాణి పాత్రలో కనిపిస్తుంది. ఆమె చాలా ఇన్నోసెంట్‌గా ఉండాలి, కొత్తగా ఉండాలి, అందుకే కత్రినాని అనుకున్నారు. కత్రినా కైఫ్‌ని అప్రోచ్ అయితే మొదట నో చెప్పిందట. రకరకాలుగా టైమ్ వేస్ట్ చేస్తుందట, దీంతో ఇతర హీరోయిన్లని, మోడల్స్ ని అనుకున్నారట.
సోనాలీ బింద్రేని కూడా అనుకున్నారు
ఓ క్రమంలో సోనాలీ బింద్రేని కూడా అప్రోచ్ అయ్యారట. ఆమెని దాదాపు ఓకే అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో సోనాలీ బింద్రే కూడా హ్యాండిచ్చిందట. దీంతో దర్శకుడు విజయభాస్కర్ పట్టుబట్టి మరోసారి కత్రినా కైఫ్‌తో మాట్లాడారు. కన్విన్స్ చేశారు. అలా కత్రినా కైఫ్ `మల్లీశ్వరి` మూవీ చేసింది. తెలుగులో చేసిన తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. కానీ ఈ ఆఫర్‌ని సోనాలీ బింద్రే మిస్ చేసుకుంది. ఓ బ్లాక్ బస్టర్‌ని ఆమె మిస్ చేసుకుందనే చెప్పాలి. ఇక `మల్లీశ్వరి` తర్వాత కత్రినా `అల్లరి ప్రియుడు` మూవీలో నటించింది. ఇది ఆడలేదు. ఆ తర్వాత తెలుగులో ఆమె మళ్లీ సినిమాలు చేయలేదు.
మల్లీశ్వరి మూవీ స్టోరీ
ఈ సినిమాలో వెంకటేష్, కత్రినా కైఫ్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. పైగా అందంతోపాటు అభినయంతోనూ కత్రినా కైఫ్ ఆకట్టుకుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా విశేష ఆదరణ పొందింది. ఇందులో మీర్జాపూర్ సంస్థానానికి చెందిన యువరాణిగా కత్రినా కనిపిస్తుంది. ఆమెకి కోట్ల ఆస్తులుంటాయి. వాటిపై బంధువులైన పొలిటీషియన్ కోటా శ్రీనివాసరావు కన్నుపడుతుంది. కత్రినాని చంపేయాలని ప్లాన్ చేస్తారు. కానీ ఆమెని రహస్యంగా వేరే ప్రాంతంలో ఉంచుతారు వాళ్ల తాత. అక్కడ వెంకటేష్ పరిచయం అవుతారు. పెళ్లి కానీ ప్రసాద్‌గా పాపులర్ అయిన ఆయన కత్రినా వెంటపడుతుంటాడు. ఈ క్రమంలో ఈ ఇద్దరు ప్రేమలో పడతారు. తన ఆస్తులను ఎన్జీఓకి రాసి వెంకటేష్‌తో వెళ్లిపోవడమే ఈ చిత్ర కథ.
సోనాలీ బింద్రే తెలుగులో చేసిన సినిమాలు
సోనాలి బింద్రే `మురారి` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. `ఇంద్ర`, `ఖడ్గం`, `మన్మథుడు`, `పల్నాటి బ్రహ్మనాయుడు`, `శంకర్ దాదా ఎంబీబీఎస్` చిత్రాలలో నటించి విజయాలు అందుకుంది. `పల్నాటి బ్రహ్మనాయుడు` తప్ప అన్ని చిత్రాలు విజయం సాధించాయి. కానీ ఆ తర్వాత సోనాలీ బింద్రే సినిమాలు మానేసింది. ఇటీవలే మళ్లీ ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది.

