- Home
- Entertainment
- రాహుల్ సిప్లిగంజ్, హరిణ్య రెడ్డి లవ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయ్యిందో తెలుసా? ఏళ్లనాటి కథ
రాహుల్ సిప్లిగంజ్, హరిణ్య రెడ్డి లవ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయ్యిందో తెలుసా? ఏళ్లనాటి కథ
రాహుల్ సిప్లిగంజ్, హరిణ్య రెడ్డిల వివాహం ఈ నెల 27న జరగబోతుంది. ఈ నేపథ్యంలో వీరి లవ్ స్టోరీ ఆసక్తికరంగా మారింది. తన లవ్ స్టోరీని రాహుల్ బయటపెట్టాడు.

ఈ నెల 27న రాహుల్ సిప్లిగంజ్, హరిణ్య రెడ్డి మ్యారేజ్
ఆస్కార్ విన్నింగ్ సాంగ్ `నాటు నాటు` సింగర్, బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఈనెల 27న ఆయన పెళ్లి చేసుకోబోతున్నారు. హరిణ్య రెడ్డితో రాహుల్ మ్యారేజ్ జరగబోతుంది. ఈ సందర్భంగా రాహుల్ తాజాగా(మంగళవారం) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని పెళ్లికి ఆహ్వానించారు. తన కాబోయే భార్య హరిణ్య రెడ్డితో కలిసి వెళ్లి సీఎంకి ఆహ్వానం అందించారు. రేవంత్ రెడ్డి పెళ్లికి రాబోతున్నట్టు రాహుల్ తెలిపారు.
రాహుల్ సిప్లిగంజ్, హరిణ్య రెడ్డి లవ్ స్టోరీ
ఇదిలా ఉంటే రాహుల్ సిప్లిగంజ్, హరిణ్య రెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. ఆగస్ట్ 17న వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఇన్నాళ్లు తన లవ్ ట్రాక్‌ని రహస్యంగా ఉంచిన రాహుల్.. ఎంగేజ్‌మెంట్‌తో డైరెక్ట్ గా రివీల్ చేశారు. అయితే రాహుల్ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయ్యింది? వీరిద్దరు మొదట ఎక్కడ కలుసుకున్నారనేది ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో ఈ విషయాన్ని వెల్లడించారు రాహుల్. `బిగ్ బాస్` షోలోనే ఆమెని కలిశాడట. హరిణ్య బిగ్ బాస్ షో ప్రొడక్షన్ కంపెనీ అయిన ఎండేమోల్ షైన్ ఇండియాలో ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్‌గా పనిచేసింది. ఆ టైమ్‌లోనే రాహుల్‌తో పరిచయం ఏర్పడిందని, అది ప్రేమగా మారిందట.
చేతిలో చెయ్యేసి, రాహుల్ ప్రేమ మొదలైంది ఇక్కడే
రాహుల్ సిప్లిగంజ్ ఆ మధ్య ఫ్యామిలీ స్టార్స్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ లవ్‌స్టోరీకి సంబంధించిన అసలు విషయం చెప్పారు. ఒక రియాలిటీ షోలో తన కళ్లకి గంతలు కట్టుకొని బయటకు వచ్చినట్టు తెలిపారు. కళ్లకి గంతలు కట్టుకుని వచ్చినా, బయట ఏం చూడొద్దని చెప్పి మా చేయిని ఒకరికి ఇస్తారు. అప్పుడు నా చేయి పట్టుకుంది. ఆ చేయిని ఇప్పటి వరకు వదల్లేదని తెలిపారు రాహుల్. బిగ్ బాస్ విన్నర్ అయ్యాక ఆయన్ని బయటకు తీసుకొచ్చే సమయంలో రాహుల్ చేయిని హరిణ్య చేతిలో పెట్టారని, అప్పుడు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి, ఇప్పుడు పెళ్లి వరకు వెళ్లింది. ఇదంతా ఆరేళ్లుగా సాగిన కథ. ఎందుకంటే 2019లో రాహుల్ బిగ్ బాస్ తెలుగు 3 షోలో పాల్గొని విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
హరిణ్య రెడ్డి ఫ్యామిఈ బ్యాక్ గ్రౌండ్
ఇదిలా ఉంటే హరిణ్య రెడ్డి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ చూస్తే ఆమెకి మంచి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది. టీడీపీ సీనియర్ నాయకులు నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మెన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్న కూతురు కావడం విశేషం. వీరు నందమూరి బాలకృష్ణ ఫ్యామిలీకి కూడా అత్యంత సన్నిహితులు అని సమాచారం. హరిణ్యరెడ్డికి సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమెకి ఇన్ స్టాలో 15వేల మంది ఫాలోవర్స్ కూడా ఉండటం విశేషం. ఇక ఈ నెల 27న జరిగే వీరి పెళ్లికి సినీ, రాజకీయ ప్రముఖులు భారీగా పాల్గొనబోతున్నారట. హరిణ్య రెడ్డిది పొలిటికల్ ఫ్యామిలీ కావడం, రాహుల్‌ది సినిమా ఫ్యామిలీ కావడంతో వీరి మ్యారేజ్ చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేసినట్టు సమాచారం.
`నాటు నాటు` అంటూ ఆస్కార్ వేదికపై రాహుల్ పాట
ఫోక్ సింగర్‌గా కెరీర్ ప్రారంభించిన రాహుల్ సిప్లిగంజ్ నెమ్మదిగా సింగర్‌గా ఎదిగాడు. సినిమాల్లో మాస్ పాటలతో ఉర్రూతలూగించారు. తెలంగాణ స్లాంగ్ యాడ్ చేసి ఆయన పాడిన పాటలకు విశేష స్పందన లభించింది. అందులో భాగంగానే `ఆర్‌ఆర్‌ఆర్`లో నాటు నాటు పాటని ఆలపించారు. ఈ పాట ఆస్కార్ అవార్డుని గెలుచుకుంది. ఈ వేడుక సమయంలో ఆస్కార్ వేదికపై రాహుల్ ఇదే పాటని ఆలపించడం విశేషం. అంతేకాదు పర్‌ఫెర్మ్ కూడా చేశారు.

