Asianet News TeluguAsianet News Telugu

"హైదరాబాద్ లవ్ స్టోరీ" మూవీ రివ్యూ

  • నటీనటులు: రాహుల్ రవీంద్రన్, రేష్మీ మీనన్, జియా, రావు రమేష్, అంబటి, రమాప్రభ, షఫీ, సన, సూర్య, రచ్చ రవి
  • మ్యూజిక్ : సునీల్ కశ్యప్
  • దర్శకత్వం: రాజ్ సత్య
  • నిర్మాతలు: ఏం.ఏల్ రాజు, ఆర్.ఎస్.కిషన్, వేణు గోపాల్ కొదుమగుళ్ళ
  • ఆసియానెట్ రేటింగ్ : 2.75/5
hyderabad love story movie review
  • Facebook
  • Twitter
  • Whatsapp

కథ :

భాగ్యలక్ష్మి (రేష్మీ మీనన్) చలాకైన యువతి. మెట్రో రైల్ ప్రాజెక్ట్‌ లో ఇంజినీర్‌గా పని చేస్తున్న కార్తీక్ (రాహుల్ రవీంద్రన్)  తొలిచూపులోనే కార్తీక్, భాగీ ప్రేమలో పడుతారు. భాగ్యలక్ష్మి(భాగీ)తో ప్రేమలో పడటానికి ముందే కార్తీక్‌కు వైష్ణవి (జియా) అనే యువతితో బ్రేకప్ అవుతుంది. కార్తీక్‌తో పీకల్లోతూ ప్రేమలో మునిగిన భాగీకి వైష్ణవి ఓ భయంకరమైన విషయాన్ని చెబుతుంది. దాంతో కార్తీక్, భాగీ మధ్య మనస్పర్ధలు వస్తాయి. కార్తీక్ గురించి భాగీకి వైష్ణవి చెప్పిన భయంకరమైన విషయం ఏమిటి? కార్తీక్, వైష్ణవిలకు ఎందుకు బ్రేకప్ అయింది?  కార్తీక్, వైష్ణవి మళ్లీ కలుసుకొన్నారా? కార్తీక్, భాగీ ప్రేమకు ముగింపు ఏమిటీ? అనే ప్రశ్నలకు తెరమీద సమాధానమే హైదరాబాద్ లవ్‌ స్టోరీ.

 

విశ్లేషణ :

రాహుల్, రేష్మి మధ్య ప్రేమ, ఆకర్షణ అంశాలతో లవ్ ట్రాక్‌ను దర్శకుడు రాజ్ సత్య ఆహ్లాదంగా కొనసాగిస్తూనే, దానికి కామెడీ ట్రాక్‌ను మిక్స్ చేశాడు. అయితే కామెడీ ట్రాక్ నాసిరకంగా ఉండటంతో కథలోని ఇంటెన్సిటీని పక్కదారి పట్టింది. అయితే ఓ ఆసక్తికరమైన పాయింట్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. సెకండాఫ్‌లో జియాతో కార్తీక్ లవ్ ట్రాక్, కార్తీక్, రేష్మీల ప్రేమ వ్యవహారం ఎపిసోడ్స్ ఫీల్‌గుడ్‌గా అనిపిస్తాయి. ఈ సినిమాలో రాహుల్ రవీంద్రన్ పర్సనల్ లైఫ్ బ్యాక్ డ్రాప్ కీలకమైన అంశంగా మారుతుంది. కథ మొత్తం రాహుల్ వ్యక్తిగత జీవితం చూట్టే తిరగడంతో పీక్స్ కు వెళ్లినట్లనిపిస్తుంది. క్లైమాక్స్‌ లో సెంటిమెంట్ సీన్స్ ఆకట్టుకొనేలా ఉంటాయి.

దర్శకుడు రాజ్ సత్య ఎంచుకొన్న లీడ్ పాయింట్ బాగుంది. కాకపోతే దాని చుట్టూ అల్లుకొన్న కామెడీ ట్రాక్ విషయంలోనే తడబడ్డాడు. కామెడీని సరిగ్గా పండించలేకపోయాడు. సినిమా తొలిభాగంపై పట్టుకోల్పోయినట్లుగా అనిపించినా... సెకండాఫ్‌లో తనదైన టేకింగ్‌తో కొత్త దర్శకుడు అనే ఫీలింగ్ కనిపించకుండా కవర్ చేసేశాడు. కీలక సన్నివేశాల్లో ప్రతిభను చాటుకొన్నాడు. కథపై ఇంకొంచెం, కామెడీ ట్రాక్‌పై మరింత కసరత్తు చేసి ఉంటే ఫీల్‌గుడ్ సినిమా తన కెరీర్‌లో పడి ఉండేది.

 

లవర్ బాయ్ క్యారెక్టర్లలో రాహుల్ రవీంద్రన్ నటన ప్రత్యేకంగా కనిపిస్తుంది. అతడి హావభావాలు చాలా సున్నితంగా ఉంటాయి. ఈ సినిమాలో తండ్రి చనిపోయిన సన్నివేశంలోనూ, తన మిత్రుడు కోమాలోకి వెళ్లిపోయే సీన్‌లో భావోద్వేగమైన నటనను ప్రదర్శించాడు. తన పాత్ర పరిధి మేరకు రాహుల్ మంచి నటనతో ఆకట్టుకొన్నాడు. సినిమాకు రేష్మీ మీనన్ గ్లామర్ అదనపు ఆకర్షణ. చక్కటి నవ్వుతో, మంచి ఎక్స్‌ప్రెషన్స్‌తో అద్భుతంగా కనిపించింది. కీలక సన్నివేశాల్లోనూ మెప్పించింది. నటనపరంగా మరింత శ్రద్ధ తీసుకొంటే గ్లామర్‌తోపాటు ప్రతిభవంతురాలైన నటిగా పేరుతెచ్చుకొనే అవకాశం ఉంది. కార్తీక్‌కు మరో లవర్‌గా జియా కనిపించింది. గ్లామర్‌‌తోనే కాకుండా అందాల ఆరబోతలో కూడా జియా ముందున్నట్టు కనిపించింది. జియా నటనకు కూడా మంచి స్పందనే కనిపించింది. కీలక సన్నివేశాల్లో కొంత తడబాటు కనిపించింది. రావు రమేష్‌ది గుర్తుండిపోయే రోల్. డాక్టర్ పాత్రలో తన మార్కును వదలిపెట్టలేదు. కథకు ఆయువుపట్టుగా మారిన సీన్లకు రావు రమేష్ జీవం పోశాడు. సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చేందుకు శాయశక్తులా ప్రయత్నించాడు. సూర్య, సన ఆకట్టుకొన్నారు. అయితే హాస్య నటులు మాత్రం విసుగు పుట్టించారు. సినిమాకు ప్రతిబంధకంగా మారారు. సునీల్ కశ్యప్ రీ రికార్డింగ్ బాగుంది. పాటలు మాస్ ప్రేక్షకులకు, యూత్‌కు కనెక్ట్ కాలేదనిపిస్తుంది.

 

రొటీన్ ప్రేమ కథలా కాకుండా ఓ డిఫరెంట్ పాయింట్‌తో హైదరాబాద్ లవ్‌స్టోరి రూపొందింది. నటీనటులు పెర్ఫార్మెన్స్, సాంకేతిక నిపుణుల ప్రతిభ ఈ సినిమాకు బలం అని చెప్పవచ్చు. కాకపోతే కామెడీ సన్నివేశాలు చికాకు పుట్టిస్తాయి. రాహుల్ రవీంద్రన్, రేష్మీ నటన, కథ ప్రొడక్షన్ వ్యాల్యూస్, సినిమాటోగ్రఫీ ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. డైలాగ్స్ తోపాటు కామెడీ ట్రాక్స్ ఈ చిత్రానికి మైనస్ పాయింట్ గా నిలిచాయి.

చివరగా :

 ఓవరాల్ గా హైదరాబాద్ లవ్ స్టోరీ ఫీల్ గుడ్ మూవీలా అనిపిస్తుంది

Follow Us:
Download App:
  • android
  • ios