బిగ్ బాస్ సీజన్ 2 కి నాని రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.?

First Published 22, Mar 2018, 8:00 AM IST
huge remuneration to nani for bigboss season 2
Highlights
  • న్యాచురల్ స్టార్ నానీ తన ఖాతాను మరింత బలపర్చుకుంటున్నాడు
  • ఇప్పటికే వరుస హిట్లతో టాలీవుడ్ మెయిన్ స్ట్రీమ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నానీకి మరో అరుదైన ఛాన్స్​
  • ‘బుల్లితెర బిగ్ బాస్’గా కొత్త అవతారానికి నాని ఓకె చెప్పేశాడు​

న్యాచురల్ స్టార్ నానీ తన ఖాతాను మరింత బలపర్చుకుంటున్నాడు. ఇప్పటికే వరుస హిట్లతో టాలీవుడ్ మెయిన్ స్ట్రీమ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నానీకి మరో అరుదైన ఛాన్స్! ‘బుల్లితెర బిగ్ బాస్’గా కొత్త అవతారానికి నాని ఓకె చెప్పేశాడు. ‘ఎండోమెల్ ఇండియా-స్టార్ మా’ టీమ్ ఇప్పటికే నానీని కలిసి డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. మరో వారంపదిరోజుల్లో ఫార్మాలిటీస్ కూడా అయిపోవచ్చు. దీంతో ఇప్పటివరకూ వినిపించిన ఊహాగానాలే నిజమైనట్లయింది.

వెండితెర హీరోగా సెటిలైన నాని ఈ బుల్లితెర అవకాశాన్ని కెరీర్లో ఒక ప్రమోషన్ గా భావిస్తున్నానని సన్నిహితుల దగ్గర చెప్పుకున్నాడు. స్టార్ హీరో తారక్ చేసిన ప్రాజెక్ట్ నానికి దక్కడం అంటే అతనొక మెట్టు పైకెక్కినట్లే లెక్క. పైగా.. రానా, బన్నీలను కూడా అప్రోచ్ అయ్యి.. చివరకు నానీ దగ్గరున్న కంటెంట్ తోనే  షో మేకర్స్ కమిట్ అయ్యారట. స్పాంటేనియస్ గా మాట్లాడగలగడం, ఎప్పటికప్పడు సిట్యుయేషన్స్ ని టాకిల్ చెయ్యగలగడం, అన్నిటికంటే మించి.. కూల్ నేచర్ ని కలిగి ఉండడం నానీకి ప్లస్ అయినట్లు చెబుతున్నారు. దీనికి తోడు తారక్ కు 8 కోట్ల రెమ్యునరేషన్ దక్కింది. ఇప్పుడు నాని 4 కోట్ల రెమ్యునరేషన్  ముట్టనున్నట్టు సమాచారం.

loader