'ఆర్ ఎక్స్ 100' శాటిలైట్ రైట్స్ కు కళ్లు చెదిరే రేటు..!

Huge demand for RX 100 Satellite Rights
Highlights

ఇప్పుడు ఎక్కడ చూసినా యూత్ లో అంతా కూడా 'ఆర్ ఎక్స్ 100' సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు. రీసెంట్ గా థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, విడుదలైన ప్రతి చోటున విజయవిహారం చేస్తోంది. రెండున్నర కోట్లతో నిర్మించబడిన ఈ సినిమా ఫస్టు వీకెండ్ లోనే రెట్టింపు వసూళ్లను రాబట్టింది. 

కార్తికేయ .. పాయల్ రాజ్ పుత్ జంటగా నటించిన ఈ సినిమా, వసూళ్ల పరంగా అదే జోరును చూపిస్తూ ఉండటం విశేషం. దాంతో ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కోసం టీవీ చానల్స్ పోటీపడుతున్నాయట. ఈ సినిమాకి గల క్రేజ్ ను దృష్టిలో పెట్టుకున్న నిర్మాత .. 6 కోట్ల వరకూ చెబుతున్నాడట. కుర్రకారు హృదయాలను పొలోమంటూ కొల్లగొట్టేస్తోన్న ఈ సినిమాకి మంచి రేటింగ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ గనుక, కాస్త అటు ఇటుగా శాటిలైట్ రైట్స్ ను సొంతం చేసుకోవడానికి ఎవరికి వారు ప్రయత్నిస్తున్నారని సమాచారం.

loader