నేను ఆ నటిని పెళ్లాడలేదు!

huccha venkat response on his marriage
Highlights

గత కొద్దిరోజులుగా శాండల్ వుడ్ నటుడు హుచ్చ వెంకట్ పెళ్లి విషయంపై రచ్చ జరుగుతూనే ఉంది

గత కొద్దిరోజులుగా శాండల్ వుడ్ నటుడు హుచ్చ వెంకట్ పెళ్లి విషయంపై రచ్చ జరుగుతూనే ఉంది. నటి ఐశ్వర్యను వివాహం చేసుకున్నట్లు ఆయన తన సోషల్ మీడియాలో వెల్లడించాడు. పెద్దలు అంగీకరించకపోవడంతో రహస్య వివాహం చేసుకున్నామని చెప్పిన హుచ్చ వెంకట్ ఇప్పుడు మాట మార్చాడు. తాను ఐశ్వర్యను వివాహం చేసుకోలేదంటూ బుధవారం ఒక వీడియోను విడుదల చేశాడు.

అది నిజం పెళ్లి కాదని సినిమా షూటింగ్ లో భాగంగా జరిగిన దృశ్యాలను సోషల్ మీడియాలో రిలీజ్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి 'డిక్టేటర్ హుచ్చ వెంకట్' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని, పెళ్లి కూడా చేసుకున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఐశ్వర్య తల్లి హుచ్చ వెంకట్ కారణంగా ప్రాణ భయం ఉందని బహిరంగంగా వెల్లడించింది. కానీ ఇప్పుడు అసలు హీరో గారు మొత్తం సీన్ మార్చేసి పెళ్లే కాలేదని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 

loader