ప్రతిష్టాత్మక సంఘమిత్ర మూవీలో యువరాణి గా నటిస్తున్న శృతీ హాసన్ తన కేరక్టర్ కు అవసరమైన కత్తి యుద్ధంలో శిక్షణ పొందుతున్న శృతి లండన్ లో యాక్షన్ కొరియోగ్రఫర్ వద్ద కత్తిసాము నేర్చుకుంటున్న శృతి
భారీ బడ్జట్ తో తెరకెక్కుతున్న త్రిభాషా చిత్రం సంఘమిత్ర చిత్రం కోసం సిద్ధమవుతున్న అందాల తార శృతి హాసన్... చిత్రంలో తన కేరక్టర్ కోసం అవసరమైన అన్ని అంశాల్లో ఏ ఒక్క మెలకువను వదలకుండా ప్రతీ అంశంపై పట్టు సాధించేలా కష్టపడి నేర్చుకుంటోంది. సంఘమిత్ర చిత్రంలో యువరాణిగా, యోధురాలిగా నటిస్తున్న శృతిహాసన్ లండన్ లో కత్తి సాముపై కఠోర శిక్షణ తీసుకుంటోంది.
సంఘమిత్ర పాత్రధారిగా నటిస్తున్న శృతి తన కేరక్టర్ కు కావాల్సిన అన్ని అంశాల్లోను తర్పీదు తీసుకుంటోంది. ఈ చిత్రంలో యుద్ధాల్లో నిష్ణాతురాలైన ఓ సంక్లిష్టమైన యువరాణి పాత్రలో శృతి నటిస్తోంది. ఈ చిత్రంలో తన కేరక్టర్ కు సంబంధించినంతవరకు ఏ చిన్న పొరపాటు చేయకూడదని, తన నుంచి రావాల్సిన నటనను ఏ మాత్రం తక్కువ కాకుండా అన్ని విధాల ప్రదర్శించాలని శృతి భావిస్తోంది.
అందుకే గత కొంత కాలంగా శృతి లండన్ లో కత్తి యుధ్దంలో నిపుణుడైన యాక్షన్ కొరియోగ్రఫర్ వద్ద ట్రైనింగ్ తీసుకుంటోంది. ప్రస్థుతం శృతికి కత్తి యుద్ధంలోని యుక్తులన్నీ ఆ ట్రైనర్ నేర్పిస్తున్నాడు. ఆ తర్వాత కత్తి యుద్ధంలో అతి ముఖ్యంగా అవసమైన ఖచ్చితత్వం, చురుకుదనం లాంటి అంశాల్లో మెలకువలు నేర్పిస్తారు. దీంట్లో కేవలం కత్తి యుద్ధం మాత్రమే కాక మనసును పూర్తిగా లగ్నంచేసేందుకు, ఏకాగ్రతకు అవసరమైన కొన్ని తీవ్రమైన మెలకువలు కూడా నేర్పిస్తారట. అంతేకాదు తెరపై ఏ మాత్రం లొసుగులు లేకుండా పర్ఫామ్ చేసేలా ప్రతి చిన్న విషయాన్ని నేర్చుకునేలా శృతీహాసన్ నిజమైన ఖడ్గవీరులతో శిక్షణ తీసుకుంటోంది.
