తన భార్యను రాజమౌళి ఎంత ప్రేమగా పిలిచారో చూడండి!

How Rajamouli calls his wife?
Highlights

 రాజమౌళి అవార్డు అందుకున్న సమయంలో వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్న వారు రమా రాజమౌళిని కూడా స్టేజ్ మీదకు ఆహ్వానించారు. మొదట రమాకు అర్ధం కాకపోవడంతో కూర్చొనే ఉండిపోయారు.

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి 'బాహుబలి' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఐదేళ్ల పాటు శ్రమించి ఆయన తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. ఆయన కుటుంబం మొత్తం ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యారు. ఆయన భార్య రమా రాజమౌళి ఈ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేశారు. ఆమె కూడా సినిమా కోసం తనవంతు కృషి చేసింది.

ఈ సినిమాకు గాను రాజమౌళి ఎన్నో అవార్డులను అందుకున్నారు. ఇందులో భాగంగా బిహైండ్ వుడ్స్ గోడల మెడల్ అవార్డుల్లో రాజమౌళి ఉత్తమ దర్శకుడిగా బంగారు పతాకం అందుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తోంది. రాజమౌళి అవార్డు అందుకున్న సమయంలో వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్న వారు రమా రాజమౌళిని కూడా స్టేజ్ మీదకు ఆహ్వానించారు.

మొదట రమాకు అర్ధం కాకపోవడంతో కూర్చొనే ఉండిపోయారు. అప్పుడు రాజమౌళి మైక్ తీసుకొని.. 'స్టేజ్ పైకి రమ్మంటున్నారు చిన్ని' అని ప్రేమగా పిలిచారు. వెంటనే లేచి స్టేజ్ పైకి వెళ్తున్న రమా రాజమౌళిని తమ ఫోన్ కెమెరాలో బంధించింది నటి అనుష్క. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.. 

 

loader