Asianet News TeluguAsianet News Telugu

శ్రీదేవి మరణంపై హోటెల్ సిబ్బంది చెప్పిన షాకింగ్ నిజాలు..

  • శ్రీదేవి చివరి చూపు కోసం ఇండియా మొత్తం ఎదురు చూస్తోంది.
  • అంత్యక్రియలు టీవీల్లో అయినా చూడాలనుకుంటున్న అభిమానులు
Hotel staff information about sridevi last hours

శ్రీదేవి చివరి చూపు కోసం ఇండియా మొత్తం ఎదురు చూస్తోంది.  శ్రీదేవి అంత్యక్రియలు టీవీల్లో అయినా చూడాలని, చివరి చూపు కోసం వెయిట్ చేస్తున్న అభిమానులు ఎందరో. అయితే శ్రీదేవి మరణించే చివరి క్షణాల్లో ఏం జరిగింది? అనే విషయంలో ప్రతి ఒక్కరిలోనూ అమయోయం నెలకొని ఉంది.
శ్రీదేవి గుండెపోటుకు గురైంది దుబాయ్‌లోని జుమైరా ఎమిరేట్స్ టవర్స్ అనే హోటల్‌లో. ఈ హోటల్‌లోనే ఆమె బస చేశారు. ఆమె మరణానికి ముందు హోటల్‌లో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలపై...పరస్పర విరుద్ధమైన రిపోర్ట్స్ ప్రచారంలో ఉన్నాయి.యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన ఆంగ్ల పత్రిక ఖలీజ్ టైమ్స్ రిపోర్ట్స్ ప్రకారం.... బోనీ కపూర్ తన చిన్న కూతురు ఖుషి, మరికొందరితో కలిసి ఇండియా తిరిగి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. శనివారం సాయంత్రం 5.30 గంటలకు శ్రీదేవి బస చేసిన హోటల్ చేరుకుని ఆమెను సర్ ప్రైజ్ చేశారు. శ్రీదేవి, బోనీ ఇద్దరూ కలిసి కొంత సేపు మాట్లాడుకున్నారు. తర్వాత కలిసి డిన్నర్ చేద్దామనుకున్నారు. శ్రీదేవి ప్రెషప్ కావడానికి బాత్రూం వెళ్లారు. 15 నిమిషాలైనా ఆమె తిరిగి రాక పోవడంతో బోనీ వెళ్లి చూడటంతో ఆమె బాత్‌టబ్ లో చలనం లేకుండా పడిపోయి ఉన్నారు.ఖలీజ్ టైమ్స్ రిపోర్ట్స్ ప్రకారం....శ్రీదేవి చలనం లేకుండా పడిపోయి ఉండటంతో బోనీ వెళ్లి లేపడానికి ట్రై చేశాడు. ఆమె ఎంతకీ లేవక పోవడంతో తన స్నేహితుడికి ఫోన్ చేశాడు. వెంటనే దుబాయ్‌లోని రషీద్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్దారించారు. 9 గంటలకు పోలీసులకు సమాచారం అందించారు.అయితే మిడ్-డే పత్రిక కథనం మరోలా ఉంది. శ్రీదేవిని బాత్రూంలో చలనం లేకుండా గుర్తించింది మొదట బోనీ కపూర్ కాదని, హోటల్ స్టాఫ్ అంటూ ఆ పత్రికలో వార్తలు వచ్చాయి.హోటల్‌కు చెందిన ఓ ఉద్యోగి మిడ్ డే డైలీతో మాట్లాడుతూ...శ్రీదేవి చివరి క్షణాల్లో తన గదిలో ఒంటరిగానే ఉన్నారని వెల్లడించారు. హోటల్ సిబ్బంది చెప్పిన ఈ విషయం అందరినీ అయోమయంలో నెట్టి వేసింది.హోటల్ సిబ్బంది చెప్పినట్లు మిడ్ డే పత్రిక పేర్కొన్న కథనంలో..... 10.30 గంటలకు శ్రీదేవి డ్రింకింగ్ వాటర్ కోసం రూమ్ సర్వీస్ కు కాల్ చేశారు. 15 నిమిషాల్లో సర్వర్ రూమ్ వద్దకు చేరుకున్నారు. పలుసార్లు కాలింగ్ బెల్ కొట్టినా శ్రీదేవి నుండి రెస్పాన్స్ రాలేదు.అయితే శ్రీదేవి ఎంతకీ తలుపు తీయక పోవడంతో ఆందోళనకు గురైన సిబ్బంది ఎమర్జెన్సీ అలారం మ్రోగించారు. అనంతరం సిబ్బంది అంతా కలిసి రూమ్‌లోకి ఎంటయ్యారు. బాత్రూంలో శ్రీదేవి ప్లోర్ మీద స్పృహ లేకుండా పడిపోయి ఉన్నారు. అపుడు సమయం రాత్రి 11 గంటలు అవుతోందని సిబ్బంది తెలిపినట్లు మిడ్ డే పత్రిక పేర్కొంది.హోటల్ సిబ్బంది శ్రీదేవిని చలనం లేకుండా గుర్తించే సమయానికి ఆమె నాడి ఇంకా కొట్టుకుంటూనే ఉంది. వెంటనే ఆమెను రషీద్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వైద్యులు ఆమె మరణించినట్లు గుర్తించారు.మిడ్ డే కథనం ప్రకారం.... ఆమె చనిపోయిన సమయంలో బోనీ కపూర్ వెంట లేరని, హోటల్ సిబ్బంది మాత్రమే ఉన్నారని పేర్కొనబడి ఉంది.అయితే మీడియాలో వస్తున్న విరుద్ధ కథనాలతో అభిమానుల్లో అయోమయం నెలకొని ఉంది. ఏది ఏమైనా శ్రీదేవి మరణం అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios