హాట్ కపుల్ రూ.5 కోట్లు డిమాండ్!

hot couple demands 5 crores to endorse oil
Highlights

బాలీవుడ్ లో అజయ్-కాజోల్, ఐష్-అభిషేక్, అనుష్క-విరాట్, సౌత్ కి వచ్చేసరికి చై-సామ్, జ్యోతిక-సూర్య వంటి జంటలు బ్రాండింగ్ వరల్డ్ లో బాగా ఫేమస్ అవుతున్నారు. తమకున్న క్రేజ్ ను పలు బ్రాండ్ లకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

బాలీవుడ్ లో అజయ్-కాజోల్, ఐష్-అభిషేక్, అనుష్క-విరాట్, సౌత్ కి వచ్చేసరికి చై-సామ్, జ్యోతిక-సూర్య వంటి జంటలు బ్రాండింగ్ వరల్డ్ లో బాగా ఫేమస్ అవుతున్నారు. తమకున్న క్రేజ్ ను పలు బ్రాండ్ లకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అయితే వీరంతా పెళ్లైన తరువాత ఒక్కటిగా యాడ్స్ చేస్తూ మెప్పిస్తున్నారు. కానీ ఇప్పుడు ఒక హాట్ కపుల్ మాత్రం పెళ్లి కాకముందే ఓ యాడ్ కోసం రూ.5 కోట్లు డిమాండ్ చేసి వార్తల్లో నిలిచారు.

ఇంతకీ ఆ జంట ఎవరు అనుకుంటున్నారా..? మరెవరో కాదు టైగర్ ష్రాఫ్-దిశా పటానీ. గత కొంతకాలంగా ఈ జంట ప్రేమలో ఉన్నట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. బాలీవుడ్ లో జరిగే పలు ఈవెంట్లకు ఈ జంట కలిసి రావడం వంటి విషయాలు వీరి రిలేషన్షిప్ ను కన్ఫర్మ్ చేస్తున్నాయి. తాజాగా అంబానీ ఫ్యామిలీ జరిగిన ఈవెంట్ కు కూడా వీరిద్దరూ జంటగా వెళ్లారు. ఈ జంటతో ఓ యాడ్ చేయాలనుకున్న ప్రముఖ వంట నూనె  కంపనీ సంస్థ వీరిని సంప్రదించగా రూ.5 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

నిమిషం పాటు సాగే యాడ్ కోసం ఈ రేంజ్ లో డిమాండ్ చేయడమంటే మామూలు విషయం కాదు. అయితే ఈ విషయం సదరు కంపనీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. రీసెంట్ గా చై-సామ్ కలిసి చేసిన బిగ్ బజార్ యాడ్ కోసం వారు ఈ రేంజ్ లో పారితోషికం అందుకున్నట్లు సమాచారం. మొత్తానికి తమకున్న క్రేజ్ ను యాడ్స్ కోసం ఈ హాట్ కపుల్స్ బాగానే వినియోగిస్తున్నారు. 
 

loader