Asianet News TeluguAsianet News Telugu

మరో హాలీవుడ్ డైరెక్టర్ 38 మంది మహిళలతో!

  • హాలివుడ్ ను లైంగిక వేధింపుల గొడవలు షేక్ చేస్తున్నాయి.
  • సినిమాల్లో స్టార్‌డమ్‌ కల్పిస్తానని న్యూయార్క్‌ స్ట్రీట్‌లో కలిసి ఆశ చూపేవాడని పలువురు నటీమణులు తెలిపారు.
  • టోబాక్పై లైంగిక ఆరోపణలు చేసిన 38మందిలో 31మంది మహిళలు ఆన్‌ రికార్డు మాట్లాడటం గమనార్హం.
hollywood director james toback sexual harassment masturbation

హాలివుడ్ ను లైంగిక వేధింపుల గొడవలు షేక్ చేస్తున్నాయి. ప్రముఖ నిర్మాత వెయిన్‌ స్టీన్‌పై లైంగిక ఆరోపణలు ఇంకా ముగియకముందే తాజాగా మరో హాలీవుడ్‌ దర్శకుడి బాగోతం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ దర్శకుడు, ఆస్కార్‌ గ్రహీత జేమ్స్ టోబాక్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఏకంగా 38మంది మహిళలు ఆరోపించారు. న్యూయార్క్‌ స్ట్రీట్‌లో తమను టోబాక్ కలిసి, సినిమాల్లో స్టార్‌డమ్‌ కల్పిస్తానని ఆశ చూపేవాడని వారు ఆరోపించారు.

 

సినిమాల్లో స్టార్‌డమ్‌ కల్పిస్తానని న్యూయార్క్‌ స్ట్రీట్‌లో కలిసి ఆశ చూపేవాడని పలువురు నటీమణులు తెలిపారు. ఆయనతో సమావేశాలు చాలాసార్లు లైంగిక అంశాలతోనే ముగిసేవని, కొన్నిసార్లు తమ ముందే అతను హస్తప్రయోగ చర్యకు పాల్పడేవాడని, లేకుంటే లైంగిక చర్యకు రెచ్చగొట్టేలా ప్రవర్తించేవాడని పలువురు గుర్తుచేసుకున్నారు. కొన్ని సార్లు ఆయనతో పాటు మరికొందరు ప్రముఖ నటులు కూడా ఉన్నారని చెప్పినా వారి పేర్లు మాత్రం బయటకి రావటం లేదు.

 

72 ఏళ్ల టోబాక్ ఈ ఆరోపణలను తిరస్కరించారు. తనపై ఆరోపణలు చేసిన మహిళలెవరితో తాను సమావేశం కాలేదని, ఒకవేళ ఐదు, పది నిమిషాలు వారితో కలిసినా తనకు వారు గుర్తులేరని చెప్పారు. టోబాక్పై లైంగిక ఆరోపణలు చేసిన 38మందిలో 31మంది మహిళలు ఆన్‌ రికార్డు మాట్లాడటం గమనార్హం.

 

గిటారిస్ట్‌, వోకలిస్ట్‌ లౌవ్‌సీ పోస్ట్‌, ప్రముఖ నటి టెర్రీకాన్‌ తదితరులు ఆయన బాగోతాన్ని బయటపెట్టారు. సినిమాలో తమకు అవకాశం వస్తుందన్న ఆశతో అతని లైంగిక ఆగడాలు, వేధింపులు భరించామని కొంతమంది మహిళలు తెలిపారు. టోబాక్ కథనం వెలువడిన కాసేపటికే అతనిపై ఆరోపణలు చేసిన మహిళల సంఖ్య రెట్టింపు అయింది.

 

ఈ కథనం తర్వాత మరింతమంది ముందుకొచ్చి అతని ఆగడాలను బయటపెడుతున్నారని టైమ్స్‌ రిపోర్టర్‌ గ్లెన్‌ విప్‌ తెలిపారు. హార్వే వెయిన్‌స్టీన్‌ పలువురు మహిళలపై, నటీమణులపై లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడినట్టు వెలుగుచూడటం హాలీవుడ్‌లో కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే.

 

వెయిన్‌స్టీన్‌ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నటి-దర్శకురాలు ఏషియా అర్జెంటోతోపాటు పలువురు టోబాక్ బాగోతాన్ని వెలుగులోకి తెచ్చిన మహిళలకు ఆన్‌లైన్‌లో మద్దతు ప్రకటించారు.ఇప్పటికే#MeeToo అనే హాష్ ట్యాగ్ తో లైంగిక వేదిపులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios