'అరవింద సమేత'లో హైలైట్ అదే!

highlight episode in ntr aravinda sametha movie
Highlights

అసలు విషయానికొస్తే.. సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో మాస్ ఆడియన్స్ ను అలరించే విధంగా ఇటువంటి ట్రాక్ లు రాలేదని చాలా నమ్మకంగా చెబుతోంది 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'అరవింద సమేత'. అక్టోబర్ నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆగస్టు 15న సినిమా టీజర్ ను విడుదల చేసే అవకాశం ఉంది. అదే రోజు సినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించనున్నారు.

అయితే ఈ సినిమాలో తారక్ పాత్ర ఎలా ఉండబోతోందనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో కలుగుతోంది. రెండు వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ లో అయితే తారక్ కనిపించడం ఖాయమనిపిస్తోంది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సిక్స్ ప్యాక్ తో రఫ్ లుక్ తో కనిపించబోతున్నాడు. అలానే స్టూడెంట్ పాత్రలో స్మార్ట్ లుక్ తో ఎంటర్టైన్  చేయనున్నాడు. ఇక అసలు విషయానికొస్తే.. సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు.

ఈ మధ్య కాలంలో మాస్ ఆడియన్స్ ను అలరించే విధంగా ఇటువంటి ట్రాక్ లు రాలేదని చాలా నమ్మకంగా చెబుతోంది చిత్రబృందం. ఇంటర్వెల్ సమయానికి మొదలయ్యే ఈ ఎపిసోడ్ సినిమా స్థాయిని మరింత పెంచుతుందని అంటున్నారు. ప్రస్తుతం లవ్ సీన్స్ చిత్రీకరిస్తోన్న చిత్రబృందం త్వరలోనే ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.  

loader