బిజినెస్ మెన్ తో హీరోయిన్ పెళ్లి?

First Published 17, May 2018, 12:08 PM IST
heroine trisha is ready to start new relationship
Highlights

ఈ మధ్యకాలంలో హీరోయిన్లందరూ సీక్రెట్ గా పెళ్లి చేసుకొని తరువాత తమ పెళ్లి విషయం 

ఈ మధ్యకాలంలో హీరోయిన్లందరూ సీక్రెట్ గా పెళ్లి చేసుకొని తరువాత తమ పెళ్లి విషయం చెబుతున్నారు. మొన్నామధ్య శ్రియ కూడా ఇలానే చేసింది. తన స్నేహితురాలి పెళ్లి కోసం షాపింగ్ చేస్తున్నానని చెప్పి తనే పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చింది. ఇక సోనమ్ కపూర్ కూడా విదేశాల్లో షాపింగ్ చేసుకొని పెళ్లిపీటలు ఎక్కేసింది. తాజాగా మరో హీరోయిన్ పెళ్ళికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

ఒకప్పుడు దక్షినాది స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన త్రిష ఇక్కడ అవకాశాలు తగ్గడంతో కోలివుడ్ కు షిఫ్ట్ అయిపోయింది. చేతిలో అరడజను సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఇంత బిజీగా ఉన్నా.. రీసెంట్ గా తన పుట్టినరోజు సెలబ్రేషన్స్ కోసం విదేశాలకు వెళ్ళింది. అక్కడ వరకూ ఓకే.. కానీ ఎన్నడూలేని విధంగా అక్కడ భారీ షాపింగ్ చేసిందట ఈ బ్యూటీ.

అడిగితే ఏం లేదన్నట్లు వ్యవహరిస్తోన్న సన్నిహితులు మాత్రం ఇది పెళ్లి షాపింగ్ అంటూ కుండబద్దలు కొడుతున్నారు. చాలా రోజులుగా త్రిష పెళ్లిపై పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. కొద్దిరోజులుగా ఆమె ఓ బిజినెస్ మెన్ తో సన్నిహితంగా మెలుగుతోందని, అతడినే వివాహం చేసుకోనుందని అంటున్నారు. ఈ ఏడాదిలో ఆమె వివాహం జరగడం ఖాయమని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి!

loader