పెళ్లైన హీరోలు రొమాన్స్ చేయొచ్చా.. మేం చేయకూడదా..? హీరోయిన్ ఫైర్

heroine rashmika fires on netizens
Highlights

మగాళ్లు పెళ్లయిన తరువాత కూడా వేరే హీరోయిన్లతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయొచ్చు. దానికి మీకు ఎలాంటి సమస్య ఉండదు. అదే హీరోయిన్లు పెళ్లి తరువాత ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తే.. మాత్రం మీరు తట్టుకోలేరు. ఆమెపై మీకు ఉండే గౌరవం కూడా పోతుంది. ఇదెక్కడి న్యాయం

కన్నడలో 'కిరిక్ పార్టీ'  చిత్రంతో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ రష్మిక తెలుగులో 'ఛలో' అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంది. 'ఛలో' సినిమాకు ముందే దర్శకుడు రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ చేసుకుంది రష్మిక. త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారు. ప్రస్తుతం రష్మిక తెలుగులో 'గీత గోవిందం' అనే సినిమాలో నటిస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పోస్టర్లను విడుదల చేసింది చిత్రబృందం.

ఒక పోస్టర్ లో హీరో విజయ్.. రష్మికను ఎత్తుకొని తీసుకెళ్తూ ఉంటాడు. ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన రష్మికపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. రక్షిత్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్న తరువాత కూడా ఇలాంటి రొమాంటిక్ సీన్లు ఎలా చేస్తావంటూ ఆమెను తప్పుబట్టారు. అయితే రష్మిక వీటికి ధీటైన సమాధానం చెప్పింది. 'మగాళ్లు పెళ్లయిన తరువాత కూడా వేరే హీరోయిన్లతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయొచ్చు.

దానికి మీకు ఎలాంటి సమస్య ఉండదు. అదే హీరోయిన్లు పెళ్లి తరువాత ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తే.. మాత్రం మీరు తట్టుకోలేరు. ఆమెపై మీకు ఉండే గౌరవం కూడా పోతుంది. ఇదెక్కడి న్యాయం' అని ప్రశ్నించింది. ఇలా కామెంట్స్ చేసేవారిలో ఎక్కువమంది ఫేక్ అకౌంట్స్ కలిగి ఉన్నారని. ఇలా కామెంట్స్ చేసి ఎదుటివారి ఫీలింగ్స్ ను ఎలా హర్ట్ చేస్తారని ఆవేదన వ్యక్తం చేసింది. 

loader