ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ మళ్లీ తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. సినిమాల్లో అవకాశాలు తగ్గిన తరువాత పలు చిత్రాలలో ప్రత్యేక గీతాల్లో కనిపించిన రంభ 2010లో ఇంద్రన్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.

ఆ తరువాత కవల పిల్లలకు జన్మనిచ్చిన రంభ ఇప్పుడు మరోసారి తల్లి అవుతున్నందుకు సంతోషంగా ఉందంటూ తన ఫోటోను షేర్ చేసింది. ఆ పోస్ట్ చూసిన అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రసవం సురక్షితంగా జరగాలని కోరుకుంటున్నారు.