నాకు అర్జున్ రెడ్డి కన్నా.. 'ఆర్ ఎక్స్ 100' చాలా బాగా నచ్చింది : పాయల్ రాజ్ పుత్

First Published 16, Jul 2018, 11:21 AM IST
Heroine payal rajputh says i like RX 100 a lot than arjun reddy
Highlights

యూత్ చిత్రంగా గత వారం విడుదలై తొలి రోజు నుంచే ప్రేక్షకాదరణ పొందిన 'ఆర్ ఎక్స్ 100' కలెక్షన్ల పరంగా దూసుకెళుతుండగా, ఇందులో హీరోయిన్ గా తన అందాలను ఆరబోసిన పాయల్ రాజ్ పుత్, ఇంత బోల్డ్ గా నటించాలంటే ఎంతో ధైర్యం ఉండాలని, తనకా ధైర్యం ఉందని చెబుతోంది.
 
ఎంతో మంది హీరోయిన్లు ఈ పాత్రను నిరాకరించారని, నెగెటివ్ షేడ్ ఉన్న ఇలాంటి డేరింగ్ క్యారెక్టర్ చేయాలంటే సాహసం ఉండాలని, తాను ఏ మాత్రం భయపడకుండా సినిమాకు ఓకే చెప్పానని అంటోంది. అయితే తనకు అర్జున్ రెడ్డి కన్నా 'ఆర్ ఎక్స్ 100' చాలా బాగా నచ్చిందని చెప్పింది.  రొటీన్ కు భిన్నంగా ఉన్న ఈ పాత్ర ప్రేక్షకులకు దగ్గర కావడం, పాయల్ అందం, అభినయం చూస్తున్న విశ్లేషకులు, ఆమెకు వరుస అవకాశాలు లభిస్తాయని జోస్యం చెబుతున్నారు.

loader