జబర్దస్త్ తో ఇంటింటా పాపులర్ అయిపోయిన ఎమ్మెల్యే రోజా గతంలో సినిమా షూటింగుల్లో పేకాట ఆడేదాన్నని చెప్పిన రోజా భైరవ ద్వీపం షూటింగ్ రోజుల్లో తనతో బాలయ్య పేకాట ఆడించారన్న రోజా

షూటింగ్ గ్యాప్‌లో పేకాట ఆడటం పాత తరం నటుల్లో ఎక్కువగా కనిపించేది. సత్యనారాయణ, గిరిబాబు, సూర్యకాంతం తదితర సీనియర్ నటులు షూటింగ్‌లలో పేకాట ఆడేవారని చెప్పుకొంటారు. లేటెస్ట్ జనరేషన్‌కు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అందుబాటులోకి రావడంతో నటీనటులు మొబైల్ ఫోన్స్‌, సోషల్ మీడియాకు పరిమితమయ్యారు. ఇంతకీ విషయమేంటంటే.. తాజాగా సినీ నటి, ఎమ్మెల్యే రోజా తన పాత రోజులను ఓ సారి గుర్తు చేసుకొన్నారు. షూటింగ్ గ్యాప్‌లో తాను పేకాట ఆడేదాన్నని ఇటీవల రోజా చెప్పుకొచ్చారు.

భైరవ ద్వీపం షూటింగ్‌ జరుగుతున్నప్పుడు బాలకృష్ణ పేకాట ఆడుదామని పిలిచేవాడు. అలా సమయం దొరికితే తామిద్దరం పేకాట ఆడేవాళ్లం. ఆయన సెట్లో ఉంటే పేకాట సందడి కనిపించేది అని రోజా వెల్లడించారు. భైరవద్వీపం షూటింగ్‌లో సీనియర్ నటులు సత్యనారాయణతో కూడా పేకాట ఆడాను. అయితే నేను ఎప్పుడూ డబ్బులు పెట్టి ఆడలేదు. మొదట్లో బాలయ్య ఒత్తిడితో పేకాట ఆడటం నేర్చుకొన్నాను. ఆ తర్వాత మరెవరితో ఆడలేదు అని చెప్పింది . వాస్తవానికి మొదట్లో నాకు పేకాట ఆడటం అంతగా రాకపోయేది. ఓసారి పేకాట ఆడినట్టు తెలిసి ఆ అమ్మ కొట్టింది. కానీ షూటింగ్‌లో బాలకృష్ణతో పేకాట ఆడటం తప్పలేదు అని రోజా చెప్పుకొచ్చింది.

జబర్దస్త్ కామెడీ షో నాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ కార్యక్రమం ద్వారా మరింత పాపులర్ అయ్యాను. ఒకవేళ నన్ను జబర్దస్త్ రోజా అని పిలిస్తే నేనేమి ఫీల్ కాను. ఎందుకంటే నాకు మంచి గుర్తింపు తెచ్చిన కార్యక్రమం అది కనుక అని రోజా ఓ ప్రశ్నకు సమాధానమిచ్చింది. జబర్దస్త్‌ షోను అన్ని వర్గాల వారు ఆదరిస్తున్నారు. అందుకే అంత పాపులర్ అయింది. ఐదేళ్లుగా షో కొనసాగుతున్నదంటే ఆషామాషీ వ్యవహారం కాదు అని రోజా వ్యాఖ్యానించింది. మల్లెమాల ప్రొడక్షన్ రూపొందించే ఈ కార్యక్రమంలో మెగా బ్రదర్ నాగబాబు, రోజా న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.